ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సజావుగా గ్రామపాలన అధికారి పరీక్షలు

ABN, Publish Date - May 23 , 2025 | 12:21 AM

గ్రామపాలన అధికారి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించా రు.

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): గ్రామపాలన అధికారి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించా రు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం గ్రామపాలన అధికారి పరీక్షల నిర్వహణపై ఎస్పీ మహేష్‌ బిగీతేతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ అదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే గ్రామపాలన అధికారి పరీక్షలకు సిరిసిల్ల జిల్లాలో 65 మంది అభ్యర్థులు హాజరవుతారని గీతానగర్‌లోని జిల్లా పరిషత్‌ బాలిక ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెవె న్యూ డివిజనల్‌ నోడల్‌ అధికారిగా ఈ పరీక్షలను నిర్వహిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఉదయం 8గంటల వరకు ప్రశ్నా పత్రాలు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షాకేంద్రాలకు సెల్‌ ఫోన్‌లు, చేతిగడియాలను అనుమతివ్వవద్దన్నారు. పరీక్షలు ముగిసి న తర్వాత అభ్యర్థుల జవాబు పత్రాలను సీజ్‌చేసి ఎస్కార్ట్‌తో కన్వీ నర్‌ జేఎస్టీయూ హైదరాబాద్‌కు తరలించాలన్నారు. పరీక్ష కేంద్రం లో ప్రతి బెంచ్‌కు ఒక అభ్యర్ధి ఉండేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల గెటు ఉదయం 10గంటలకు మూసివేయడం జరుగుతుం దని, గేటు మూసివేసిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించ వద్దని పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్‌ కోరారు. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియా రాలను ఏర్పాటు చేయాలని ప్రతి అరగంటకు అభ్యర్థులకు సమ యం తెలిసేందుకు ఏర్పాటుచేయడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేసి పరిసరా ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్‌లను మూసివేయించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో రాం రెడ్డి, జిల్లా అడిట్‌ అధికారి శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ లోకిని శారద, సెస్‌ ఎండీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:21 AM