ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితులకు భరోసా కల్పించాలి

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:39 AM

పోలీస్‌స్టేషన్‌కు వివిద కారణాలతో వచ్చే బాదితులకు పని అవుతుందనే భరోసా కల్పించాలని ఎస్పీ మహేష్‌ బి గితే పేర్కొన్నారు.

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌కు వివిద కారణాలతో వచ్చే బాదితులకు పని అవుతుందనే భరోసా కల్పించాలని ఎస్పీ మహేష్‌ బి గితే పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను, వివిధ గ్రామాలలో జరిగిన సంఘటనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరచూ నమో దవుతున్న కేసుల వివరాలు, పెండింగ్‌లో ఎన్ని కేసులు ఉన్నాయో ఎస్సై ద్వారా వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పో లీస్‌స్టేషన్‌ వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. పెట్రోలింగ్‌ సమయంలో అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయాలన్నారు. రౌడీషీటర్ల ప్రస్తుత పరిస్థితిపై నిరంతరం నిఘూ కొనసాగించాలన్నారు. సైబర్‌ నేరాలు, మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే చెడు ఫలితాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్‌ సీఐ మొగిలి, ఎస్సై కదిరె శ్రీకాం త్‌గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:39 AM