పశువైద్యులు ధ్రువీకరించిన మాంసాన్ని విక్రయించాలి
ABN, Publish Date - May 22 , 2025 | 12:57 AM
పశువైద్యులు ధ్రువీకరించిన మేకల, గొర్రెల మాంసాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని బుధవారం సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ నాయకులు వినతిపత్రం అందించా రు.
సిరిసిల్ల టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి) పశువైద్యులు ధ్రువీకరించిన మేకల, గొర్రెల మాంసాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని బుధవారం సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ నాయకులు వినతిపత్రం అందించా రు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడారు. సిరిసి ల్లపట్టణంలో నిబంద్ధనలకు విరుద్ధంగా చాలా సంవత్సరాలుగా పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా మేకలు, గొర్రెల మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరో గ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. విక్రయదారులు చనిపో యిన, అనారోగ్యంతో బాధపడుతున్న మేకలు, గొర్రెలను కోసి వాటి మాంసం ను విక్రయిస్తున్నారన్నారు. చాలామంది విక్రయదారులు కోసిన మేక, గొర్రెల మాంసం అమ్మగా మిగిలితే ఆ మాంసాన్ని ఫ్రిజులో పెట్టి మరుసటి రోజు అమ్ముతున్నారన్నారు. మరికొందరు ఆడగొర్రెలను కోసి పొట్టేలు మాంసం అంటూ ప్రజలను మోసం చేస్లూ అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసు కుంటున్నారని ఆరోపించారు. చాలా సంవత్సరాల క్రితం సిరిసిల్ల పట్టణంలో స్లాట్‌హౌస్‌లు నిర్మించినప్పటికి అక్కడ మేకలు, గొర్రెలు కోయకుండా విక్ర యదారులు గృహాలలో అనారోగ్యంతో ఉన్న వాటిని కోస్తూ ప్రజల ఆరోగ్యాల తో చెలగాటం అడుతున్నారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాలో రూ. 600 లకు కిలో మాంసం ఉంటే సిరిసిల్లలో వ్యాపారులు సిండికేట్ అయి అధిక ధరలకు అమ్ముతున్నారని అడ్డగోలుగా పెంచిన మాంసం ధరలను అధికారు లు నియంత్రించాలన్నారు. ఇప్పటికెనా స్లాటర్‌హౌస్‌లో పశువైద్యుల సమక్షం లో మేక,గొర్రెలను కోసి విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయం కార్యదర్వి ఎలిగేటి రాజశేఖర్, నాయకుడు బూర్ల సందీప్ పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:57 AM