జూన్‌లో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:30 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు జూన్ మాసంలో ప్రారంభించ నున్న సందర్భంగా భక్తులకు అనుబంధ ఆలయ మైన భీమేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తాత్కా లికంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ కల్చరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు జూన్ మాసంలో ప్రారంభించ నున్న సందర్భంగా భక్తులకు అనుబంధ ఆలయ మైన భీమేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తాత్కా లికంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవదాయశాఖ కమిషనర్ శ్రీధర్, వీటీడీఏ వైస్‌చైర్మన్, సెక్రెటరీ, కలెక్టర్ సందీప్ కుమార్‌లతో కలిసి గురువారం రాజన్న ఆలయాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయం ప్రాంగణం, ఆవరణ, ఆలయం ముందు భాగంతో పాటుగా శ్రీభీమేశ్వర స్వామివారి ఆలయాన్ని క్షేత్ర స్థాయిలో ఆలయ అభివృద్ధి నమూనాలతోపాటు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వేముల వాడ దేవా లయ అభివృద్ధికి రూ.38 కోట్లు ప్రకటించారన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో పెటుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని కార్యాచరణ రూ పొందిస్తున్నామన్నారు.
శృంగేరి పీఠం అనుమతితో పనులు ప్రారంభిస్తాం
శైలజరామయ్యార్
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.76 కోట్లు, అన్నదాన సత్రానికి రూ.35 కోట్లు, రోడ్డు వెడల్పు పనులకు రూ.47 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. దేవాలయ అభివృ ద్ధితో పాటుగా పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అన్న దాన సత్రం నిర్మాణ పనులుకు టెండర్ పూర్తి చేశామని తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో స్థపతి వల్లినా యగం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్‌రెడ్డి, ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఆర్‌అం డ్‌బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్‌రెడ్డి, సీఈ ఎలక్ర్టికల్ లింగారెడ్డి, ఎస్‌ఈ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమ ణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్‌శర్మ, ఉప ప్రధాన అర్చకు లు నమిలికొండ రాజేశ్వరశర్మ, శరత్‌శర్మ పాల్గొన్నారు.
రాజన్న సేవలో..
రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సంద ర్శనకు వచ్చిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవ దాయశాఖ కమిషనర్ శ్రీధర్, వీటీడీఏ వైస్ చైర్మన్, సెక్రెటరీ, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాలకు స్వాగతం పలికారు.
Updated Date - Apr 18 , 2025 | 12:30 AM