ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ

ABN, Publish Date - May 28 , 2025 | 01:12 AM

కరీంనగర్‌లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్దపెద్ద దుకాణదారులు వారి సామగ్రిని ఫుట్‌పాత్‌లపై పెడుతున్నారు.

కరీంనగర్‌ క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్దపెద్ద దుకాణదారులు వారి సామగ్రిని ఫుట్‌పాత్‌లపై పెడుతున్నారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా తరచుగా పాదచారులు వాహనాల కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు.

ఫ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు

టవర్‌సర్కిల్‌, రాజీవ్‌చౌక్‌, కమాన్‌, శాస్త్రిరోడ్‌, ఇందిరాచౌక్‌, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, రాంనగర్‌ చౌరస్తా, మంకమ్మతోట, నాకా చౌరస్తా తదితర ముఖ్యకూడళ్లు, ప్రధాన రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌ల ఆక్రమణతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టవర్‌సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌ ఏరియాలో రోడ్లపైననే వీధి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో అక్కడ నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విపరీతమైన రద్దీ నెలకొంటున్నది.

ఫ నామమాత్రంగా దాడులు

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అప్పడప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన సామాగ్రిని తొలగిస్తున్నారు. ఒకటి, రెండ్రోజుల తరువాత తిరిగి ఎప్పటిమాదిరిగానే ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమిస్తున్నారు.

ఫజోన్‌ల గుర్తింపుతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం...

కరీంనగర్‌లో చిరువ్యాపారులు ఎడెక్కడ వ్యాపారాలు నిర్వహించుకోవాలి? ఎక్కడ పెట్టకూడదు? సాయంత్రం మాత్రమే వ్యాపారాలు చేసుకునే ప్రాంతాల గుర్తించి కేటాయించాల్సిన అవసరముంది. ఈ ప్రక్రియలోనే వ్యాపారాలు, పార్కింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని జోన్లను రూపొందించాల్చి ఉంది. ఆ ప్రాంతాల్లోనే వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటే టవర్‌సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌, ప్రకాశం గంజ్‌ తదితర రద్దీ ప్రాంతాల్లో ట్రాపిక్‌ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. వాహనాలు నిలిపే ప్రాంతాలను పార్కింగ్‌ జోన్‌, నిలపని ప్రాంతాలను నో పార్కింగ్‌ జోన్‌, వ్యాపారాలు, ఇతర నిర్వాహణకు అనుమతినిస్తూ గ్రీనోజోన్‌, అసలు ఎటువంటి నిర్వహణ ఉండకుండా రెడ్‌జోన్‌లుగా గుర్తించి, అవన్నీ పక్కా అమలయ్యేలా చూస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఫుట్‌పాత్‌ వ్యాపారాలవల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో పోలీసులు జాబితాను తయారుచేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. కొంతకాలం కిందటే చిరు వ్యాపారుల కోసం వెండింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసిన మున్సిపల్‌ అధికారులు చిరు వ్యాపారులను అక్కడికి పంపించటంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ఫ పద్మవ్యూహంగా టవర్‌సర్కిల్‌ ప్రాంతం....

కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌ ప్రాంతాలకు నగరవాసులు వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని నిత్యావసర సరుకుల దుకాణాలతో పాటు ఎలక్ట్రికల్‌, ఫర్నిచర్‌, బట్టలు, యంత్రసరికరాలతో కూడిన ఇతర ముఖ్య దుకాణాలన్ని ఇక్కడనే ఉంటాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. ప్రధాన కూరగాయలు, పండ్ల మార్కెట్‌ కూడా ఇక్కడే ఉండడంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలుపెట్టడానికి కూడా స్థలం లేకుండా రద్దీ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపుల పండ్లు, కూరగాయల దుకాణాలు, మరోవైపున ద్విచక్రవాహనాల రాకపోకలు, సరుకులను తీసుకువచ్చిన ఆటోలు, ఇతర వాహనాలతో కొనుగోలుదారులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల పార్కింగ్‌ తీవ్రమైన సమస్యగా నెలకొంది. ప్రధాన కూడలి అయిన టవర్‌సర్కిల్‌, రాజీవ్‌చౌక్‌, ప్రకాశం గంజ్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ జోన్‌ లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

Updated Date - May 28 , 2025 | 01:12 AM