రాజన్న ఆలయ అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు..
ABN, Publish Date - May 17 , 2025 | 12:41 AM
వేము లవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని కాం గ్రెస్ కరీంనగర్ పార్లమెంటరీ కోకన్వీనర్ కన మేని చక్రధర్‌రెడ్డి అన్నారు.
ముస్తాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): వేము లవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని కాం గ్రెస్ కరీంనగర్ పార్లమెంటరీ కోకన్వీనర్ కన మేని చక్రధర్‌రెడ్డి అన్నారు. ముస్తాబాద్‌లో శుక్రవారం విలేకరులతో చక్రధర్‌రెడ్డి మాట్లా డుతూ బీఆర్‌ఏస్ అధికారంలో ఉండగా రాజ న్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాది కి వంద కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడి నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ అభివృ ద్ధి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండగా బీఆర్‌ఎస్ నాయకులు రాజకీ యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు సకల సౌకర్యా లు కల్పించేందుకు రూ. 70 కోట్లు మంజూరు చేశారన్నారు. వేములవాడ ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమని స్తున్నారని పేర్కొన్నారు. శృంగేరిపీఠం పండితులతో, ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న అలయం అభివృద్ధి చేస్తుంటే ప్రజ ల్లో ఆది శ్రీనివాస్‌కు మంచి పేరు రావడం జీర్ణించుకోలేని నాయకులు, ఉనికి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార ని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరిగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్‌రావు, మాజీ సర్పంచ్‌లు ఫోరం కన్వీ నర్ కాలకొండ కిషన్‌రావు, కణమేని శ్రీనివాస్ రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:41 AM