ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ బాలికలదే హవా..

ABN, Publish Date - Apr 23 , 2025 | 01:38 AM

ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో బాలికల హవా మళ్లీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెగ్యులర్‌ ఇంటర్‌, ఒకేషనల్‌ ఫలితాల్లో 66.43 శాతం ఉత్తీర్ణత సాధించారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో బాలికల హవా మళ్లీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెగ్యులర్‌ ఇంటర్‌, ఒకేషనల్‌ ఫలితాల్లో 66.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ఇంటర్‌ జనరల్‌లో 6,638 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,882 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,756 మంది ఫెయిల్‌ అయ్యారు. ఈసారి కూడా బాలికలు 1,854 మంది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే రాష్ట్ర స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానం పడిపోయింది. 2024-25 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం 24వ స్థానం, రెండో సంవత్సరంలో 28వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి సంవత్సరం 13వ స్థానం, రెండో సంవత్సరం 16వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో చందుర్తి మండలం మూడపల్లికి చెందిన విద్యార్థి మణిచంద్ర ఎంపీసీలో 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంటర్మీడియెట్‌ ఫలితాలను పరిశీలిస్తే 2019లో మొదటి సంవత్సరంలో 50 శాతం, 2020లో 51 శాతం, 2021లో 37శాతం, 2022లో 60 శాతం, 2023లో 57 శాతం, 2024లో 57.79, ప్రస్తుతం 2025లో 51.68 శాతం సాధించారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 2019లో 61 శాతం, 2020లో 63 శాతం, 2021లో వంద శాతం, 2022లో 64 శాతం, 2023లో 69 శాతం, 2024లో 65.5 శాతం, ప్రస్తుతం 65.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు గడువు ఇచ్చారు.

ఫ ఇంటర్‌లో 3882 మంది ఉత్తీర్ణత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్‌ జనరల్‌ ఫలితాల్లో రెండు సంవత్సరాలు కలిపి 6638 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3882 మంది ఉత్తీర్ణులయ్యారు. 66.43 శాతంగా ఉంది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 3336 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1724 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.68 శాతంగా ఉంది. ఇందులో బాలురు 1214 మంది పరీక్షలకు హాజరుకాగా 397 మంది ఉత్తీర్ణులయ్యారు. 37.7 శాతం ఉండగా బాలికలు 2122 మంది పరీక్షలకు హాజరుకాగా 1327 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం ఫలితాల్లో 3302 మంది పరీక్షలకు హాజరు కాగా 2158 మంది ఉత్తీర్ణులయ్యారు. 65.35 శాతంగా ఉంది. ఇందులో బాలురు 1210 మంది హాజరు కాగా 617 మంది ఉత్తీర్ణులయ్యారు. 50.99శాతం ఉండగా, బాలికలు 2092మంది హాజరుకాగా, 1541 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.66 శాతంగా ఉంది.

ఫ ఒకేషనల్‌లో 532 మంది ఉత్తీర్ణత

జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం ఇంటర్‌ ఒకేషనల్‌లో 851 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 532 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 319 మంది ఫెయిలయ్యారు. మొదటి సంవత్సరంలో 483 మంది విద్యార్థులకు 252 మంది ఉత్తీర్ణులయ్యారు. 52.17 శాతంగా ఉంది. 231 మంది ఫెయిలయ్యారు. బాలురలో 272 మందికి 96 మంది, బాలికల్లో 211 మందికి 156 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 368 మంది విద్యార్థులకు 280 మంది ఉత్తీర్ణులయ్యారు. 76.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురలో 196 మందికి 135 మంది, బాలికల్లో 172 మందికి 145 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఫ బాలురి కంటే బాలికలే అధికం...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే భేష్‌ అనిపించుకున్నారు. మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో 6,638 మంది విద్యార్థులకు 3,882 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,756 మంది ఫెయిలయ్యారు. బాలురు 1,014 మంది, బాలికలు 2,868 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అధికంగా బాలికలు 1,854 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 3,336 మంది విద్యార్థులకు 1,724 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,612 మంది ఫెయిలయ్యారు. బాలురులో 1,214 మంది పరీక్షలకు హాజరుకాగా 397 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,122 మంది హాజరు కాగా 1,327 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే 930 మంది బాలికలే అధికంగా ఉన్నారు. రెండో సంవత్సరంలో 3,302 మంది పరీక్షలకు హాజరు కాగా 2,158 మంది ఉత్తీర్ణులయ్యారు 1,144 మంది ఫెయిలయ్యారు. బాలురు 1,210 మంది హాజరు కాగా 617 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,092 మంది హాజరు కాగా 1,541 మంది ఉత్తీర్ణులయ్యారు. 924 మంది బాలికలు అధికంగా ఉన్నారు.

ఫ గురుకులాల్లో భేష్‌...

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 6 కేజీబీబీ పాఠశాలల్లో మొదటి సంవత్సరంలో 356 మంది విద్యార్థులకు 301 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 260 మందికి 193 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో రుద్రంగి కేజీబీవీలో ఎంపీసీలో లహరిక 457 మార్కులు, మర్రిపల్లిలో బైపీసీలో సుస్మిత 424 మార్కులు, తంగళ్లపల్లి కేజీబీవీలో సీఈసీలో రమ్య 454 మార్కులు, ఎంపీహెచ్‌డబ్ల్యూలో కే అర్చన 487 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మర్రిపల్లి కేజీబీవీలో పి అశ్విత ఎంపీసీలో 974 మార్కులు, సిరిసిల్ల కేజీబీవీలో బైపీసీలో కె వైష్ణవి 982 మార్కులు, తంగళ్లపల్లి కేజీబీవీలో సీఈసీలో అశ్విని 913 మార్కులు, ఎంపీహెచ్‌డబ్ల్యూలో సీహెచ్‌ రేష్మ 968 మార్కులు సాధించారు.

Updated Date - Apr 23 , 2025 | 01:38 AM