ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రంలో పారదర్శక పాలన

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:41 AM

ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందుస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

ఓదెలలో లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

ఓదెల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందుస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కులు, నూతన రేషన్‌కార్డులను ఆదివారం అందజేశారు. అలాగే జీలకుంటలో రూ. 10 లక్షల నిధుల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఓదెలలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు నూతన రేషన్‌ కార్డులను అందజేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెల్ల రేషన్‌ కార్డులున్న పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ధాన్యం కోతలు లేకుండా కొనుగోలు చేశామన్నారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద రైతులకు చెల్లించామని, అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు ప్రజలు అండగా ఉండి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి, యేడవెల్లి విజయపాల్‌రెడ్డి, చీకట్ల మొండయ్య, అంబాల కొమురయ్య, బోడకుంట స్వామి, ఆకుల మహేందర్‌, బోడకుంట శంకర్‌, గోపు నారాయణరెడ్డి, బైరి రవి గౌడ్‌, తీర్తాల వీరయ్య, పిట్టల రవీందర్‌, నాగపూరి రవి గౌడ్‌, పిట్టల నర్సింగం, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:41 AM