పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ప్రారంభం
ABN, Publish Date - Apr 23 , 2025 | 01:02 AM
జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ రెండు రోజులపాటు కొనసాగనుంది
కరీంనగర్ అర్బన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ రెండు రోజులపాటు కొనసాగనుంది. భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వశాఖ సహకారంతో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖ, తెలంగాణ భాగస్వామ్యంతో పంచాయతి కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభ, సమాచార హక్కు చట్టం, స్వచ్చందంగా సమాచారం వెల్లడించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన 35 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 01:02 AM