ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:33 AM
మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
వీర్నపల్లి, జూలై25(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో ఇందిర మహిళా శక్తి ద్వారా శ్రీవర్షిణి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయ దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఆఫ్జల్‌బేగంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం యూరియా కొనుగోలు చేసిన రైతులకు బస్తాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద స్వశక్తి సంఘాల సభ్యుల ఆర్థిక ఎదుగుదల కోసం క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, రైస్‌మిల్లులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్ల ను అందించినట్లు పేర్కొన్నారు. మారుమూల అటవీప్రాంత రైతులకు స్థానికంగా ఫర్టిలైజర్ దుకాణాలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా మండలంలో రెండు దుకాణాలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, వ్యవసాయ అధికా రి ఆఫ్జల్‌బేగం, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఐకేపి డీపీఎం పద్మయ్య, మణిక్‌రెడ్డి, ఏపీఎం నర్సయ్య, మండల వ్యవసాయాధి కారి జయ, ఎంపీడీవో బీరయ్య, ఎంఈవో తుమ్మ శ్రీనివాప్, ఆర్‌ఐ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, సీసీ శ్యామల, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, వర్షిని వీవోఏ దేవలక్ష్మి, అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి శీరిష, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకు లు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 12:33 AM