ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

ABN, Publish Date - May 15 , 2025 | 12:30 AM

ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఈనెల 22 నుంచి జరిగే పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

సిరిసిల్ల మే 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఈనెల 22 నుంచి జరిగే పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించా లని తాగునీటి వసతి కల్పించాలని వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అవసరమైన మాత్రలు అందుబాటులో ఉంచాలని అన్నారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ వారు బస్సులను సమయనూకూలంగా నడిపించాలని సెస్‌ అధికారులు విద్యుత్‌ కోత లేకుండా చూసుకోవాలని అన్నారు. పరీక్ష పత్రాలు పోలీస్‌ బందోబస్తు మధ్య తరలించాలని, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరా ఉండాలని అన్నారు.

22 నుంచి పరీక్షలు..

జిల్లాలో 22 నుంచి 29వ తేది వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్ల మెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మొదటి సంవ త్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 నుంచి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిం దని మొదటి సంవత్సరం పరీక్షలకు 2385 మంది, రెండవ సంవ త్సరం పరీక్షలు 1478 మంది హాజరవుతారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని కేంద్రంలోకి సెల్‌ ఫోన్‌లు, ఎలక్ర్టానిక్‌ వస్తువుల నిషేదం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటే శ్వర్లు, ఎస్బీ డీఎస్పీ మురళి, డీఈఐవో శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో రజితలు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:30 AM