మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
ABN, Publish Date - May 28 , 2025 | 01:09 AM
వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్ సరుకు లను వచ్చే నెలలో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్ సరుకు లను వచ్చే నెలలో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. వారం రోజుల నుంచి జిల్లాలో గల పౌరసరఫరాల గోదాముల నుంచి వాహనాల ద్వారా రేషన్ షాపులకు బియ్యాన్ని తరలిస్తున్నారు. మొదట స్టేజ్ 1 గోదాముల నుంచి పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ స్టేజ్ 2 గోదాముల నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,20,326 వివిధ రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2,07,898, అంత్యోదయ అన్న యోజన కార్డులు 12,269, అన్నపూర్ణ కార్డులు 155 ఉన్నాయి. వీటి ద్వారా 6 లక్షల 27 వేల మంది వినియోగదా రులు ప్రతీ నెల లబ్ధి పొందుతున్నారు. మూడు నెల లకు సంబంధించి 12,600 మెట్రిక్ టన్నుల కోటాను ప్రభుత్వం కేటాయించింది. కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ప్రభుత్వం రేషన్ బియ్యం అందజేస్తున్నది. గతంలో వినియోగదారులకు దొడ్డు బియ్యాన్ని సరఫరా చేయగా, ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తోంది. వచ్చే వర్షాకాలంలో భారీ వర్షాలు దేశవ్యాప్తంగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు సూచించిన మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని, గోధుమలు, చక్కెర ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఒక నెల అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. జూన్ మాసా నికి సంబంధించి ఆ నెల కోటాను విడుదల చేస్తామని, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూలైలో ఇస్తామని వారు కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూన్‌లోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు పది రోజుల నుంచి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 గోదాములకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యా న్ని సరఫరా చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బియ్యం రవాణా చేసేటప్పుడు బియ్యం తడవకుండా ఉండేం దుకు లారీలు, వ్యాన్లపై తాటిపత్రిలు, కవర్లు కప్పి సరఫరా చేస్తున్నారు. ప్రతీ రేషన్ షాపు ముందు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ఒకే సారి రేషన్ సరుకులను అందజేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండగా, మూడు నెలల రేషన్ సరుకులను ఒకే నెలలో సరఫరా చేస్తున్న దృష్ట్యా జూన్ 1 నుంచి నెలాఖరు వరకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఫ ఫోర్టిఫైడ్ రైస్‌తో కలిపి..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి సరఫరా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకా రం రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి ఇవ్వాల్సి ఉంది. రేషన్ వినియోదారులకు బలవర్ధక మైన ఆహారాన్ని అందించేందుకు గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం సరఫరా చేసే దొడ్డు బియ్యాన్ని కేవలం 20 నుంచి 30 శాతం మంది వినియోగదారులు మాత్రమే తింటుం డగా, మిగతా వినియోగదారులు రేషన్ డీలర్లకు, బయ ట వ్యాపారులకు కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు విక్రయించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని కొం దరు వ్యాపారులు కొనుగోలు చేసి బయట మార్కెట్లో కిలోకు 30 నుంచి 35 రూపాయల చొప్పున విక్రయిం చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు సన్న బియ్యాన్ని బయట మార్కెట్లో కిలోకు 40 నుంచి 50 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు గడిచిన వానా కాలం సీజన్‌లో సన్నాలు పండించే విధంగా రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చింది. సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి ఏప్రిల్ నెల నుంచి సన్న బియ్యాన్ని వినియోగదారులకు పం పిణీ చేస్తున్నది. అయితే ఇందులో ఫోర్టిఫైడ్ బియ్యం కలపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబం ధన ప్రకారం ఫోర్టిఫైడ్ రైస్ అందించాలని ఆదేశిం చడంతో సన్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి సర ఫరా చేస్తున్నది. మెజార్టీ ప్రజలు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని తింటున్న నేపథ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి ఇవ్వడం వల్ల బలవర్ధకమైన పోషకాహారం అందనున్నది.
ఫ కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ తర్వాతే...
జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి వచ్చే నెలలో ఒకేసారి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వచ్చే రెండు మాసాల్లో కొత్తగా మంజూరయ్యే రేషన్ కార్డుల వినియోగదారులకు ఆ నెలల్లో రేషన్ బియ్యం ఇచ్చే అవకాశాలు లేవు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలో ఉన్న పాత రేషన్ కార్డులు, కొత్తగా మంజూరైన రేషన్ కార్డులకు కోటా కేటాయించారు. ఆ తరువాత మంజూ రయ్యే కార్డుదారులకు సెప్టెంబర్ తర్వాతే బియ్యం పంపిణీ చేస్తారని తెలుస్తున్నది. మూడు మాసాలకు కలిపి 12,600 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను విడు దల చేసినందున కొత్తగా మంజూరు చేసే కార్డులపై బియ్యం సరఫరా చేయకపోవచ్చనే సూచనలు కనబడుతున్నాయి.
Updated Date - May 28 , 2025 | 01:09 AM