ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ సీలింగ్‌ భూముల రిజిస్ర్టేషన్లు అక్రమం

ABN, Publish Date - May 28 , 2025 | 11:45 PM

: కొత్తపల్లి హావేళి సీలింగ్‌ భూముల రిజిస్ట్రేషన్లు అక్రమమేనని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటిని రద్దు చేస్తున్నట్లు ఆర్డీవో మహేశ్వర్‌ తెలిపారు.

గంగాధర, మే 28 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి హావేళి సీలింగ్‌ భూముల రిజిస్ట్రేషన్లు అక్రమమేనని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటిని రద్దు చేస్తున్నట్లు ఆర్డీవో మహేశ్వర్‌ తెలిపారు. బుధవారం గంగాధర సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అక్రమ రిజిస్ర్టేషన్ల రద్దు ప్రకియను ఆర్డీవో మహేశ్వర్‌, డీఆర్వో ప్రవీన్‌కుమార్‌ చేపట్టారు. రిజిస్ట్రేషన్ల రద్దుకు కొత్తపల్లి ఆర్‌ఐ మహ్మద్‌ నదీం, కరీంనగర్‌ డీటీ కిరణ్‌కుమార్‌ను సాక్షులుగా ఉంచి ఆర్డీవో మహేశ్వర్‌ చర్యల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి శివారులో సర్వే నంబరు 175, 197, 198 సీలింగ్‌ భూమిలో 476 అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. ఈ డాక్యుమెంట్ల రద్దుకు కలెక్టర్‌ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చే శారు. గంగాధర సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్ల రద్దుకు బుధవారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా కలెక్టర్‌ ఆదేశాల మేర కు వేలి ముద్ర, ఫేస్‌ రీడింగ్‌తో తనతోపాటు కొత్తపల్లి ఆర్‌ఐ మహ్మద్‌ నదీం, కరీంనగర్‌ డీటీ కిరణ్‌కుమార్‌ రిజిస్ర్టేషన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 476 డాక్యుమెంట్ల రద్దుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో గంగాధర సబ్‌ రిజిస్ర్టార్‌ నూర్‌ఖాన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:02 PM