ఎల్‌ఎండీకి ఇరువైపులా ముళ్ల చెట్లు
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:37 AM
మానేరు జలాశయం(ఎల్‌ఎండీ) కట్టకు ఇరువైపులా ముళ్లపొదలు పెరిగిపోయాయి. రకరకాల చెట్లు ఏపుగా పెరిగి కట్టపై తారురోడ్డును మూసివేస్తున్నాయి. దీంతో వాకర్స్, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ముళ్ల పొదలు, సర్కార్ తుమ్మ, ఇతర పిచ్చిచెట్లతో డ్యాం కట్ట ఇరువైపులా చిత్తడి, మరుగుగా ఉండటంతో పాములు, తేళ్లకు ఆవాసంగా మారింది. ఇక డ్యాంకట్టపై కుక్కలు బెడద సరేసరి... డ్యాం కట్ట కింద వాకింగ్ ట్రాక్‌లో, కట్టపై దారిలో కుక్కలు గుంపులుగా బైఠాయించడంతో వాకర్స్, సందర్శకులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు వేల మంది వాకర్స్ వస్తుంటారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మానేరు జలాశయం(ఎల్‌ఎండీ) కట్టకు ఇరువైపులా ముళ్లపొదలు పెరిగిపోయాయి. రకరకాల చెట్లు ఏపుగా పెరిగి కట్టపై తారురోడ్డును మూసివేస్తున్నాయి. దీంతో వాకర్స్, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ముళ్ల పొదలు, సర్కార్ తుమ్మ, ఇతర పిచ్చిచెట్లతో డ్యాం కట్ట ఇరువైపులా చిత్తడి, మరుగుగా ఉండటంతో పాములు, తేళ్లకు ఆవాసంగా మారింది. ఇక డ్యాంకట్టపై కుక్కలు బెడద సరేసరి... డ్యాం కట్ట కింద వాకింగ్ ట్రాక్‌లో, కట్టపై దారిలో కుక్కలు గుంపులుగా బైఠాయించడంతో వాకర్స్, సందర్శకులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు వేల మంది వాకర్స్ వస్తుంటారు.
ఫ వెలగని విద్యుత్ దీపాలు
మానేరు జలాశయం భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఎస్సారెస్పీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్యాం కట్ట భద్రతలో భాగంగా చెట్లను తొలగించేందుకు ప్రత్యేకంగా లష్కర్లు ఉంటారు. వారు ఇటువైపు రావడమే లేదు. డ్యాంకట్టపై విద్యుత్ దీపాలు ఎప్పుడు వెలుగుతాయో... ఎప్పుడు పనిచేయకుండా పోతాయో తెలియడం లేదు. వేకువజామున వాకింగ్‌కు వచ్చే మహిళలు ఇబ్బందిపడుతున్నారు. కట్టపై కుక్కలు కూడా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ ఓపెన్ జిమ్‌ల నిర్వహణ గాలికి..
మానేరు జలాశయం కట్ట కింది భాగంలో వాకర్స్ కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెండు చోట్ల ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను పట్టించుకోవటంలేదు. జిమ్ పరికరాలు వర్షానికి తడిసి, ఎండకు ఎండిపోవడంతో చెడిపోయాయి. ఎక్సర్‌సైజులు చేస్తే విపరీతమైన శబ్ధం వస్తుంది. కొన్ని పరికరాలు పనిచేయడంలేదు. దీనిపై వాకర్స్ ఫిర్యాదు చేయడంతో పాతవాటికి రంగులు వేసి చేతులు దులుపుకున్నారు.
ఫ విద్యుత్‌దీపాల సమస్య పరిష్కరించాలి
- ఎర్రోజు కనకాచారి, మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
మానేరు జలాశయం కట్టపై నిత్యం వేల మంది వాకింగ్‌కు, డ్యాం సందర్శనకు వస్తుంటారు. విద్యుత్‌దీపాలు సరిగా పనిచేయకపోవడంతో వేకువ జామున, రాత్రి వేళలో ఇబ్బందిగా ఉంది. డ్యాం కట్టపై చెట్లను తొలగించాలని. విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేయాలి.
ఫ కర్రలుచేతపట్టుకుని వాకింగ్‌కు....
- బోయినిపల్లి నర్సింగరావు, తోటపల్లి మాజీ సర్పంచ్
వేకువజమున మూడు గంటల నుంచే డ్యాంకట్టపై సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు వాకింగ్ చేస్తుంటారు. కట్టపై గుంపులు గుంపులుగా కుక్కలు ప్రమాదకరంగా ఉన్నాయి. కుక్కల భయంతో చేతికర్రను పట్టుకుని వాకింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కట్టకు రెండువైపులా చెట్లు విస్తరించి రోడ్డుపైకి రావడంతో పాములు, తేళ్లు, ఇతర కీటకాల సమస్య ఉంది. సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
Updated Date - Aug 04 , 2025 | 12:37 AM