అభివృద్ధితో ముందుకు వెళితే ఓర్వలేకపోతున్నారు..
ABN, Publish Date - May 07 , 2025 | 11:47 PM
బీజేపీ, బీఆర్‌ఎ్‌స్ రెండూ ఒక్కటే నని, ప్రజాప్రభుత్వం అభివృద్ధి పేరిట ముందుకు పోతుంటూ చూస్తూ ఒర్వలేకపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల, మే 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎ్‌స్ రెండూ ఒక్కటే నని, ప్రజాప్రభుత్వం అభివృద్ధి పేరిట ముందుకు పోతుంటూ చూస్తూ ఒర్వలేకపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవా రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేక రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్‌లు సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చెబితే దానిని బీజేపీ, బీఆర్‌ఎస్ వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్, బండి సంజయ్ మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెల ల్లోనే గత అసెంబ్లీ సమావేశంలోనే చెప్పడం జరిగిందన్నారు. ఇష్టాను సారంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దుబారా ఖర్చు చేయకుండా తెలంగాణను ముందుకు తీసుకపోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఆడంబరాలకు పోకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్నారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సి టీలు ప్రభుత్వం పెడితే బీఆర్‌ఎస్, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని, దుబాయ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. నలుగురు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా గోప్పలు చెప్పడం చూస్తే వాళ్ల తీరు బహార్ షర్వాణీ, అందర్ పరేశానీ అన్నట్లుగా ఉందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ధనిక రాష్ట్రం అంటే బీజేపీ ఎందుకు ఖండించలేదని అన్నారు. కాళేశ్వరం పేరిట తెలం గాణ సంపదను దోచుకున్నారని అన్నారు. ఆదాయాన్ని పెంచే మార్గాలు ప్రజా ప్రభుత్వం చేపడుతుంటే అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని, కిషన్‌రెడ్డి భూములపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు. బీజేపీ అసమర్థత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం నుంచి బండి సంజయ్ నిధులు తీసుకరా వాలని అన్నారు. రోడ్డు వేశామని గొప్పలు చెబుతున్నారని, కానీ టోల్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాహూల్‌గాంధీ చెప్పినట్లుగా దేశమం తా కులగణన చేసి తీరాల్సిందేనని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. ధర్నాకు 50మంది ఎంపీలు, 15రాష్ట్రాల బీసీ సంఘం నేతలు వచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్ బీసీ కులగణననలో ఎందుకు పాల్గొనలే దని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందని, కవిత బీసీలకు నాయకత్వం వహించాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రంగానికి కూడా పాలసీ లేదని, ప్రజా ప్రభుత్వంలో అన్ని రంగాలకు పాలసీలు చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కి కరీంనగర్, సిరిసిల్లలో దిగవ చ్చు కానీ, తమ మంత్రులు వాడితే నచ్చడం లేదా వారికి, ఇంత అహంకారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోవాలని, బీఆర్‌ఎస్ హయాంలో 2022-23లో మే 6 వరకు 32,915 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రజాప్రభుత్వంలో ఇప్పటివరకు 1,12,405 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రైతులు తేడాను గమనిం చాలని కోరారు. తూకం వేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. సన్న వడ్లను కొనుగోలు చేస్తున్నామని, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, సూరదేవ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:47 PM