ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN, Publish Date - May 09 , 2025 | 12:14 AM
కొనుగోలు కేంద్రాలలో కోనుగోలు చేసిన ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనీ కలెక్టర్ సందీప్ కు మార్ ఝా అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 8 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలలో కోనుగోలు చేసిన ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనీ కలెక్టర్ సందీప్ కు మార్ ఝా అన్నారు. గురువారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కలెక్టరేట్‌లో సంబంధి త అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 244 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి లక్షా 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. గంభీరావుపేట్, రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు ఇబ్బందులు వస్తున్నాయని, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర రవాణా వాహనాలు, హామా లీల సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు. రవాణా వాహనాలు సరఫరా చేయ ని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం దిగుబడి చేసుకొని రైస్‌మిల్లులపై చర్యలు తీసుకోవాలని సూ చించారు. జిల్లాలో ప్రతి మండలంలో అధికారులు చొరవతీసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు జరిగేలా చూడాలన్నారు. రైస్‌మిల్లుల వద్ద అన్‌లోడింగ్ త్వ రగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే ఎస్మా చట్టం డిఫాల్ట్ రైస్‌మిల్లుల, రవాణా కాంట్రాక్టర్ మీద ప్రయోగించాలని, ఎక్కడైనా ఇతర ప్రాంత హామాలీలు అనే సాకుతో పనికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల ని సూచించారు. రైస్‌మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు సరఫరా చేయాలన్నారు. ఈ సమీక్ష సమా వేశంలో డీఆర్డీవో శేషాద్రి, డీటీవో వి.లక్ష్మణ్, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2025 | 12:14 AM