ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు, తాగునీటికి ఇబ్బందులు లేవు

ABN, Publish Date - Jun 12 , 2025 | 02:35 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు,తాగునీరులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కేంద్ర బృందంకు వివరించారు.

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు,తాగునీరులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కేంద్ర బృందంకు వివరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో బుధవారం ప్రధాన మంత్రి కృషి సంచాన్‌ యోజన, జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది. జిల్లాలో పీఎంకేఎస్‌వై పథకం కింద చేపట్టి వివిధ ప్రాజెక్టు పనుల పురో గతి వివరాలు, మిషన్‌ భగీరథ, జల్‌ జీవన్‌మిషన్‌ ప్రాజెక్టు వివరాల సేక రణ కోసం వచ్చిన కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాత ప్రాజెక్టుల చివరి ఆయకట్టు పెండింగ్‌ పను లు పూర్తి చేసేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అన్నారు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ద్వారా సిరిసిల్ల జిల్లాలో నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు 85శాతం అయకట్లు సృష్టించడం జరిగింద న్నారు. 333 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్స్‌ నిర్మించాల్సి ఉండగా, 280 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. 2008 రేట్ల ప్రకారం కాంట్రాక్ట్‌ ఉన్నందున పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌లు ఆసక్తి చూపడం లేద న్నారు. పెండింగ్‌ ఉన్న 99 హెక్టార్‌ల భూసేకరణ పూర్తి చేసేందుకు పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ తర్వాత జిల్లాలో రెండవ పంట కూడా వరి అధికంగా పండుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతులకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరిందన్నారు.డిసెంబర్‌ 2026 నాటికి ఈ ప్రాజెక్టు చివరి అయకట్లు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భూ సేకరణ ,పెండింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద ప్యాకేజీ 9 కింద మిడ్‌మానేరు రిజర్వాయర్‌ నుంచి టెన్నెల్‌, లిఫ్ట్‌ల ద్వారా మల్కపేట రిజర్వాయర్‌ నింపు తామని దీనికి ఉన్న కాలువ ద్వారా ఎల్లారెడ్డిపేటతో పాటు మరో రెండు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇక్కడ పెండింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్స్‌ పనులకు కేంద్రా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల సందర్శన

జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌, మొర్రాయి పల్లి గ్రామాల్లో మిషన్‌ భగీరఽథ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌తో నీటి ట్యాంకులు, గ్రిడ్‌ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందానికి చెందిన అధికారులు జాయింట్‌ కార్య దర్శి సెంథిల్‌రాజన్‌లతో పాటు అధికారులు పరిశీలించారు. మిషన్‌ భగీ రథ అధికారులు నీటి సరఫరా విధానాన్ని కేంద్ర బృందానికి వివరించారు. నీటి సరఫరా వివరాలు నమోదు చేసే రిజిస్ట్రర్‌లను కేంద్ర బృందం పరి శీలించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, మిషన్‌ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 02:35 AM