పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:49 AM
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన పల్లి మండలకేంద్రంలో నూతన రేషన్ కార్డులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్ సందీప్ కుమార్ యాదవ్ కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డు జారీ నిరంతరంగా కొనసాగుతుందన్నా రు. బోయినపల్లి మండలంలో 1070 పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 1971 రేషన్ కార్డులలో కొత్త సభ్యులను జమ చేస్తున్నమన్నారు. నూతనంగా దాదాపు 6000 మంది ప్రజలకు రేషన్ అందనున్నందని కలెక్టర్ తెలిపారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ మని కరెంట్ కనెక్షన్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్ర మాలకు రేషన్ కార్డు ఉపయోగ పడుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఎవరైనా అర్హు లు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి రేషన్‌కార్డు మంజూరు చేస్తా మన్నారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, రేషన్ కార్డు పేద ప్రజల జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. పది సంవత్సరాలుగా ఒక పేద కుటుంబానికి రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో బోయిన్‌పల్లి మండలంలో అత్యధికంగా ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు తో 9రకాల వస్తువులు ఇచ్చామని, గత పాలకుల హయాంలో ఆ సామగ్రిని రద్దు చేశారన్నారు. ముఖ్యమంత్రి, కలెక్టర్ ఎటువంటి బియ్యం తింటారో పేద ప్రజలకు కూడా అటువంటి సన్నబియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేయడం ఉగాది నుంచి ప్రారంభించామని, దీనితో రేషన్‌కార్డు ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందన్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రజిత, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశిలా, సెస్ డైరెక్టర్ కొట్టే పల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేశ్ యాదవ్, వైస్‌చైర్మ న్ వినోద్‌రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మిపతి గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నెల రమణారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవిందర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:49 AM