జాడలేని వరుణుడు
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:53 AM
జగిత్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రుతుపవ ణాలు ముందే రావడంతో ఈ యేడు సాగుకు ఇబ్బం దిలేదని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వర్షాకా లం ప్రారంభమైనా సరైన వర్షాలు లేక వ్యవసాయాధా రితంగా ఉన్న జిల్లాలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పంట కాలనానికి పక్షం రోజుల ముందు గానే కుండపోతను కురిపించింది.
జాడలేని వరుణుడు
- వాడిపోతున్న మొలకలు
జగిత్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రుతుపవ ణాలు ముందే రావడంతో ఈ యేడు సాగుకు ఇబ్బం దిలేదని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వర్షాకా లం ప్రారంభమైనా సరైన వర్షాలు లేక వ్యవసాయాధా రితంగా ఉన్న జిల్లాలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పంట కాలనానికి పక్షం రోజుల ముందు గానే కుండపోతను కురిపించింది. దీంతో రైతులు సాగు పనులు మొదలు పెట్టారు. ముందే మురి పించిన వర్షాలు అసలు సమయంలో ముఖం చాటేశాయి.
వరుణుడి కరుణకోసం..
మే నెలలోనే రుతుపవనాల రాకతో వర్షాలు కురిసి రైతాంగం పొలం బాట పట్టింది. పదహారు రోజుల ముందుగానే దుక్కులు సిద్దం చేశారు. అనుకూలమైన వాతావరణం ఉండడంతో వరి నార్లు పోశారు. అనేక ప్రాంతాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టారు. పక్షం రోజులకు పైగా చినుకు రాలకపోవడంతో ఆకా శం వైపు ఆశగా చూస్తున్నారు. మొలక శాతం అం తంత మాత్రంగానే వస్తుండడంతో మున్ముందు సాగుకు తంటాలు తప్పవనే మీమాంసలో పడ్డారు.
మేలో అధికం... జూన్‌లో లోటు
ఈ యేడు సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికా రులు అంచనా వేశారు. మే నెలలో అధిక వర్షపాతం నమోదు కాగా... జూన్‌లో వర్షాభావ పరిస్థితులతో లోటు నెలకొంది. గత యేడాది సైతం ఇదే పరిస్థితులున్నప్పటికీ...ప్రస్తుత వానాకాలం మరింత గడ్డుగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ జూన్‌లో 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.
మురిపించి ముఖం చాటేసి..
ప్రస్తుత సీజన్‌లో ముందస్తుగానే కురిసిన వర్షాలు ఆ తరువాత వారం రోజుల పాట వర్షాలు కురవక పోవడంతో ఆందోళన చెందుతుండగా మృగశిర కార్తె ప్రారంభంలో మళ్లీ జల్లులు కురిశాయి. దీంతో పొలా లను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు వేసు కున్నారు. మళ్లీ వర్షాలు లేకపోగా వేసవిని తల పించేలా ఎండలు మండిపోతున్నాయి. దీంతో అన్నదా తలు ఆందోళనకు గురవుతున్నారు. ముందే వేసిన విత్తనాలకు పెరిగిన మొక్కల ప్రాణం నిలవాలన్నా, మొలకెత్తకుండా భూమిలో ఉన్న విత్తనాలు జీవం పోసుకోవాలన్నా వర్షాలు కురవాలని రైతులు చెపుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు పడకపోతే రూ. లక్షల్లో పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయ పరిస్థితి ఇలా...
జిల్లాలో 2,48,550 మంది రైతులున్నారు. ఇందులో 2.5 ఎకరాల్లోపు 1,79,826 మంది రైతులు, 2.5 నుంచి 5 ఎకరాల్లో 52,692 మంది రైతులు, 5 ఎకరాల పైన 16,032 మంది రైతులున్నారు. 2,67,431 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఇందులో ఎస్సారెస్పీ ఆయకట్టు 1,51,746 ఎకరాలు, వరద కాలువ 11,201 ఎకరాలు, చెరువులు 85,322 ఎకరాలు, కుంటలు 19,161 ఎకరాల ఆయకట్టు ఉంది.
వానాకాలం సాగు అంచనా...
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4,15,169 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 3,10,642 ఎకరాలు, మొక్కజొన్న 32 వేల ఎకరాలు, కందులు 1,500 ఎకరాలు, పత్తి 18 వేల ఎకరాలు, చెరుకు 500 ఎకరాలు, పసుపు 8,500 ఎకరాలు, మిరప 500 ఎకరాలు, మామిడి 38,277 ఎకరాలు, వివిధ కూరగాయలు 400 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 3,750 ఎకరాల్లో సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో గత మూడు నెలల్లో వర్షం ఇలా..
ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో 12.1 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 7.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 41 శాతం తక్కువగా వర్షపాతం నమో దైంది. మే మాసంలో 20.4 మిల్లీ మీటర్ల సాధారణ వర్షాపాతానికి 180.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మే మాసంలో 783 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ మాసంలో 21వ తేదీ వరకు 105.3 మిల్లీ మీటర్ల సాధారణ వర్షాపాతానికి 75.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జూన్ మాసంలో 29 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.
వర్షాల కోసం చూస్తున్నాం
- అక్కనపల్లి జలేందర్, రైతు, యామాపూర్
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా పంటల సాగుపై ఆలోచిస్తున్నాం. వర్షం కురిసుంటే ఈ పాటికే పంటలు సాగు చేసే వాళ్లం. ఈ వానాకాలం సరియైున విధంగా వర్షాలు లేవు. వర్షాలు కురిస్తే పంటలు సాగు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాం.
దుక్కులు సిద్ధం చేసుకున్నాం
- మార్నేని భీమయ్య, రైతు, సారంగాపూర్
వానాకాలం సాగు కోసం దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నాం. వర్షం ఎప్పుడు కురుస్తుందా అని ఎదురుచూస్తున్నాం. గత ఏడాది ఈ సమయానికి పంటలు సాగు చేశాం. ఇప్పుడా పరిస్థితి కనిపించ డం లేదు. ఈ వానాకాలం ఏ చేస్తుందో అని దిగా లుగా ఉంది.
Updated Date - Jun 26 , 2025 | 12:53 AM