ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Mar 19 , 2025 | 01:05 AM

కుక్కకా టుకు గురై గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వైద్యులను ఆదేశించారు.

సిరిసిల్ల టౌన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : కుక్కకా టుకు గురై గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వైద్యులను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో సోమవా రం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్క ల సువర్ణ విద్యాలయం ఆవరణలో కుక్కల దాడిలో గాయపడింది. వెంటనే విద్యాలయం సిబ్బంది సిరిసిల్ల లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. మంగళవారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థిని సువర్ణను పరామ ర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితులను ఆసుపత్రి సూ పరింటెండెంట్‌ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నా రు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించి కుదుట పడ్డా క డిచ్చార్జి చేయాలని వైద్యులను ఆదేశించారు. విద్యా ర్థిని సువర్ణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసు కుంటామని ఆమె తల్లిదండ్రులకు కలెక్టర్‌ భరోసా ఇ చ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్‌బ్యాంక్‌ను పరిశీలించారు. వార్డులో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతు న్న పేషంట్లతో కలెక్టర్‌ మా ట్లాడి ఆసుపత్రిలో వైద్య సేవల తీరుపై వారి అభిప్రా యాలను అడిగి తెలుసు కున్నారు. ఆసుపత్రిలోని పేషం ట్లకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శింకుండా విధులు నిర్వర్థించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Mar 19 , 2025 | 01:06 AM