ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీవో 282ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:44 AM

కార్మికులకు పని గంటలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జీవో 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్‌ చేశారు.

సిరిసిల్ల రూరల్‌, జూలై 8 (అంధ్రజ్యోతి) : కార్మికులకు పని గంటలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జీవో 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మంగళవారం సీఐటీయూ జిల్లా కమిటి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీన తీసుకవచ్చిన జీవో 282ను రద్దు చేయాలంటూ జీవో కాపీలను నాయకులు దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పెట్టుబడిదారులు, కార్పోరేట్‌ల లాభాల కోసం కార్మిక వర్గాన్ని శ్రమదోపీడిలకు గురి చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8గంటల పని విధానాన్ని 10గంటలుగా మార్చి జారీ చేసిన జీవో 282ను సీఐటీయూ వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అచరణలో మాత్రం బీజేపీ ప్రభుత్వానికి అనుకూల విధానాలకు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని కార్మికులకు సంబంధించి షెడ్యూల్డ్‌ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం నయా పైసా భారం పడనటువంటి కనీస వేతనాల జీవోలను సవరించకుండా పనిగంటలు పెంచుతూ జీవోను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ జీవోకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని బుధవారం కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో హాజరై కార్మిక వర్గ ప్రతిఘటనను ప్రభుత్వాలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, సీఐటయూ నాయకులు జిందం కమలాకర్‌, బాలయ్య, రాజయ్య, దేవరాజు, లక్ష్మీ, మమత, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:44 AM