ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్లలో పుంజుకున్న వేగం

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకున్నది. నాలు గు మాసాల క్రితం ప్రయోగాత్మకంగా ఒక్కో గ్రామానికి మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు వేగం పెంచేలా అధికార యంత్రాంగం చొరవ చూపుతోంది. బేస్‌మెంట్‌ స్థాయి నుంచి స్లాబ్‌ లెవెల్‌ వరకు కొన్ని ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో స్లాబ్‌ దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇళ్లు

- పైలెట్‌ గ్రామాల్లో కొనసాగుతున్న నిర్మాణాలు

- ఇతర గ్రామాల్లో ముగ్గులు పోస్తున్న ప్రజాప్రతినిధులు

- మొదటి విడతలో 9,421 ఇళ్లకు 5,920 ఇళ్లు మంజూరు

- మెటీరియల్‌ ధరలు తగ్గించేందుకు మండలాల్లో కమిటీలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకున్నది. నాలు గు మాసాల క్రితం ప్రయోగాత్మకంగా ఒక్కో గ్రామానికి మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు వేగం పెంచేలా అధికార యంత్రాంగం చొరవ చూపుతోంది. బేస్‌మెంట్‌ స్థాయి నుంచి స్లాబ్‌ లెవెల్‌ వరకు కొన్ని ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

జిల్లాకు మొదటి విడతలో 9,421 ఇళ్లు కేటాయించగా, 5,920 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా 3,501 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని తీసుక వస్తామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచి తంగా 5 లక్షల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది. ఈ ఇళ్లను సొంత ఇంటి స్థలం ఉన్న వారికే మంజూరు చేయాలని పేర్కొంది. ఎన్నికలు జరిగిన తర్వాత నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 1,76,874 దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ యాప్‌ ద్వారా గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో గ్రామ పంచా యతీ కార్యదర్శులు గ్రామాల్లో, మున్సిపల్‌ సిబ్బంది మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దర ఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. పొటో లు తీసి, వారి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేశారు. ఈ సర్వే ద్వారా ఎల్‌ 1 కేటగిరీ (సొంత స్థలాలు ఉన్న వాళ్లు)లో 62,061 మంది, ఎల్‌ 2 కేటగిరీ (సొంత స్థలాలు లేని వాళ్లు)లో 49,596 మంది, ఎల్‌ 3 కేటగిరీ (అనర్హులు) 65,217 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆరంభించింది. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలకు ఎంత మంది అర్హులు ఉన్నారో వారందరికీ ఆ పథకాలను వర్తింపజేసింది.

ఫ 5,920 మంది లబ్ధిదారులకు మంజూరు

జిల్లాకు మొదటి విడతలో 9,421 ఇళ్లు కేటాయిం చారు. పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్లకుగాను 3,001 మందికి, రామగుండం నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు 1,500 ఇళ్లు, మంథని నియోజకవర్గంలోని జిల్లా లో గల నాలుగు మండలాలకు 1,750 ఇళ్లు కేటాయిం చగా 850 ఇళ్లు, ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండలానికి 671 ఇళ్లు కేటాయించగా 569 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠా కూర్‌ మక్కాన్‌సింగ్‌ ఇళ్లకు ముగ్గులు పోస్తున్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అక్కడ పూర్తి స్థాయిలో ఎల్‌ 1 కేటగిరీలో 1940 ఇళ్లు మంజూరు చేయగా, 775 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, మిగతా ఇళ్ల నిర్మాణాలు కూడా సాగుతున్నాయి.

ఫ రూఫ్‌ లెవెల్‌ వరకు 167 ఇళ్ల నిర్మాణాలు..

మండలానికి ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకున్నది. బేస్‌మెంట్‌ లెవెల్‌లో 561 ఇళ్లు పూర్తి కాగా, రూఫ్‌ లెవెల్‌లో 167 ఇళ్లు, స్లాబ్‌ లెవెల్‌లో 47 ఇళ్లు పూర్తయ్యాయి. అంతర్గాం మండలం మద్దిర్యాలకు 59 ఇళ్లు మంజూరు చేయగా, 17 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 8 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 4 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌ వరకు పూర్తయ్యాయి. ధర్మారం మండలం బంజేరుపల్లికి 72 ఇళ్లు మంజూరు చేయగా, 20 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 4 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, ఒక ఇల్లు స్లాబ్‌ లెవెల్‌లో, ఎలిగేడు మండలం శివపల్లి గ్రామానికి 108 ఇళ్లు మంజూరు చేయగా 40 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 11 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 4 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో పూర్తయ్యాయి. జూలపల్లి మండలం కోనరావుపేటకు 144 ఇళ్లు మంజూరు చేయగా, 27 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 6 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 4 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో, మంథని మండలం అడవి సోమన్‌పల్లికి 228 ఇళ్లు మంజూరు చేయగా, 172 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 39 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 5ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో పూర్తయ్యాయి. ముత్తారం మండలం మచ్చుపేటకు 40 ఇళ్లు మం జూరు చేయగా, 14 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, ఓదెల మండలం శానగొండకు 217 ఇళ్లు మంజూరు చేయగా, 46 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌లో, 7 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 2 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌, పాలకుర్తి మండలం రామారావుపల్లికి 124 ఇళ్లు మంజూరు చేయగా, 17 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 2 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి 153 ఇళ్లు మంజూరు చేయగా, 33 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 12 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 4 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో, రామగిరి మండలం రత్నాపూర్‌కు 323 ఇళ్లు మంజూరు చేయగా, 50 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 12 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 2 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో, కాల్వశ్రీరాంపూర్‌ మండలం అంకంపల్లి గ్రామానికి 114 ఇళ్లు మంజూరు కాగా, 10 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 5 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 2 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌, సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లికి 167 ఇళ్లు మంజూరు కాగా, 65 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 43 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 14 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌ వరకు పూర్తయ్యాయని హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

ఫ ధరల నియంత్రణకు మండలానికి కమిటీ..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అందరు లబ్ధిదారులకు ఒకే ధరకు మెటీరియల్‌, లేబర్‌ చార్జీలు తీసుకునే విధంగా మండలానికి ఒక కమిటీని నియ మించారు. ఈ కమిటీలో తహసీల్దార్‌, ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈ, లేబర్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఇసుక, సిమెంట్‌, ఇటుకలు, లేబర్‌ చార్జీలు అందిరికీ ఒకే విధంగా తీసుకునే విధంగా పర్యవేక్షిస్తుంది. ఇసుక మాత్రం ఎలాంటి సీనరేజీ పన్నులు తీసుకోకుండా ఉచితంగా ఇస్తుండగా, లబ్ధిదారులు ట్రాక్టర్‌ చార్జీలను భరించాల్సి ఉంటుంది. ఇటీవల కలెక్టర్‌ ఇటుక బట్టీల యజమానులతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇటుక ఇవ్వాలని అందుకు ధర నిర్ణయించాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నది.

Updated Date - Jul 03 , 2025 | 12:15 AM