ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బడి గంట మోగింది

ABN, Publish Date - Jun 12 , 2025 | 02:42 AM

బడి గంట మోగింది.. నిన్న, మొన్నటి వరకు వేసవి సెలవుల్లో ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు గురువారం నుంచి పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడాల్సి ఉంటుంది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

బడి గంట మోగింది.. నిన్న, మొన్నటి వరకు వేసవి సెలవుల్లో ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు గురువారం నుంచి పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడాల్సి ఉంటుంది. దంచికొట్టిన ఎండల నుంచి ఉప శమనం కలిగించేందుకు తమ కోసమేనన్నట్లుగా కురుస్తున్న చిటపట చినుకులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పాఠశాలలకు విద్యార్థులు రానుండడంతో పరిశుభ్రం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు గత ఏడాది కాలంగా అమ్మ ఆదర్శ పాఠశా లల కమిటీల ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, ఇతర మరమ్మతు పనులకు 15 కోట్ల 81 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, డ్రాపవుట్స్‌ సంఖ్యను తగ్గించేందుకు ఎప్పటి లాగానే ఈ ఏడాది 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.

ఫ పాఠశాలలకు చేరిన పాఠ్య పుస్తకాలు

జిల్లాలో 358 ప్రాథమిక పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత పాఠ శాలలు, 108 ఉన్నత పాఠశాలలు, మొత్తం 549 ఉన్నాయి. వీటిలో 24,270 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 7 మోడల్‌ స్కూళ్లలో 3,500 మంది విద్యార్థులు, 10 కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో 2,806 మంది చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులను అంద జేస్తున్నది. జిల్లాకు 81 టైటిల్స్‌ గల 2,22,560 పుస్తకాలకు మూడు టైటిల్స్‌ పుస్తకాలు మినహా 2,18,855 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. వాటిని ఇప్పటికే పాఠశాలలకు చేర్చారు. వీటితో పాటు ఉచితంగా ఇస్తున్న నోట్‌ బుక్కులు కూడా నేరుగా పాఠశాలలకు చేర్చారు. మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌ మీదియం రెండు మాధ్యమాలు కలిపి ఉన్న పుస్తకాలను గత రెండేళ్ల నుంచి ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే పాటశాలల విద్యార్థులకు కేవలం ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలనే ఇస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం కలిపి ఉన్న పాఠ్య పుస్తకాలను పార్ట్‌ 1, పార్ట్‌ 2 పుస్తకాలుగా విడగొట్టారు. ప్రస్తుతం పార్ట్‌ 1 పుస్తకాలను సరఫరా చేయగా, పార్ట్‌ 2 పుస్తకాలు సెప్టెంబర్‌ నెలలో సరఫరా కానున్నాయని అధికారులు తెలిపారు.

ఫ ఏక రూపదుస్తుల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పదిహేనేళ్లుగా ప్రతి ఏటా ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులను ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా అందజేస్తున్నారు. జిల్లాలో 23,579 మంది విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తుల కుట్టు పనిని మహిళా సంఘాలకు చెందిన మహిళలకు అందజేశారు. జిల్లాలో 359 మంది మహిళలకు 27 కేంద్రాల ద్వారా కుట్టు శిక్షణ ఇప్పించి వారిచే ఏక రూప దుస్తులను కుట్టించారు. ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఎప్పటికప్పు డు సందర్శించి బట్టలను సకాలంలో కుట్టే విధంగా చర్యలు తీసుకు న్నారు. దుస్తులు పాఠశాలలకు చేరాయి. గత ఏడాది డైస్‌ ప్రకారం దుస్తులు కుట్టించగా, అంతకంటే ఎక్కువ విద్యార్థుల సంఖ్య పెరిగితే యుద్ధ ప్రాతిపదికన దుస్తులు కుట్టిస్తామని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, ఏకరూప దుస్తులను పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఏఐ పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచేందుకు, ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ పాఠాలు బోధించనున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ టూల్స్‌ గురించి, ఉన్నత తరగతులు అభ్యసించే విద్యార్థులకు ఐఎఫ్‌పీ ప్యానెల్‌ పాఠాలు బోధించనున్నారు. ఇందుకు వేసవి సెలవుల్లో 2,724 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. అలాగే వివిధ క్రీడాం శాలు, ఇతరత్రా అంశాల్లో 300 సమ్మర్‌ క్యాంపులను నిర్వహించి 3,300 మంది విద్యార్థులకు శిక్షణ అందించామని విద్యా శాఖాధికారులు పేర్కొన్నారు.

ఫ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, యూనిఫాంలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీ యంగా తగ్గుతూ వస్తున్నది. దీంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టింది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,321 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేయగా, ఈ సంఖ్య గత విద్యా సంవత్సరం నాటికి 24,270 మంది విద్యార్థులకు పడిపోయింది. దాదాపు 6 వేల మంది విద్యార్థుల్లో కొందరు గురుకుల విద్యాలయాలకు వెళ్లగా, మరి కొందరు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లారు. ప్రతి ఏటా బడి బాట నిర్వహిస్తున్నా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉన్నది.

Updated Date - Jun 12 , 2025 | 02:42 AM