కార్మికుల త్యాగాలు వెలకట్టలేనివి..
ABN, Publish Date - May 02 , 2025 | 12:56 AM
కార్మికుల త్యాగాలకు వెలకట్టలేనివని కార్మికుల పోరాట పటిమకు తార్కాణం మేడే నిలుస్తుందని ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
సిరిసిల్ల, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికుల త్యాగాలకు వెలకట్టలేనివని కార్మికుల పోరాట పటిమకు తార్కాణం మేడే నిలుస్తుందని ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం సిరిసిల్ల లేబర్ అడ్డా వద్ద బీఆర్‌ఎ్‌స్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ హక్కుల సాధన కోసం సాగిన పోరాటంలో అనేక మంది కార్మికులు అసువులు బాసిన రోజుగా మేడే నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు అడ్డగట్ల మురళి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొల్లి రామ్మోహన్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 12:56 AM