నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:44 AM
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ మహే ష్ బి గీతే అన్నారు.
చందుర్తి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ మహే ష్ బి గీతే అన్నారు. చందుర్తి మండలం కిష్టంపెట గ్రామం లో ఏర్పాటు చేసిన 9సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, మాజీ ప్రజాప్రదినిధులతో కలిసి ఎస్పీ మహేష్ బీ.గితే శుక్ర వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్వీయారక్షణ కోసం మండలంలో మిగిలిన గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. సీసీ కెమె రాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చ న్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావ డం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సామాచారం, గ్రామాల్లో అసాం ఘిక కార్యకలాపాల సమాచారం పోలీస్ వారికి అందించాలన్నారు. ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలన్నారు.
గోవిందరాజుల స్వామి దర్శించుకున్న ఎస్పీ
చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులను గుట్టపైగల శ్రీ గోవిందరాజుల స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సంద ర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంట సీఐ వెంకటేశ్వర్లు,ఎస్.ఐ రమేష్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమా ర్, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సమర్థవంతమైన సేవలదించాలి
పోలీస్ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజ లకు సమర్ధవంతమైన సేవాలందించాలని ఎస్పీ మహేష్ బీ. గీతే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా చందుర్తి పోలీస్ సర్కిల్ కార్యా లయం, పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారు లు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన షటిల్ కోర్టు ప్రారంభించి వారి తో కలిసి షటిల్ ఆడారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రమేష్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:44 AM