హామీల అమలుతోనే ప్రజల్లో ఆదరణ..
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:52 AM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటం వల్లనే కాంగ్రెస్‌పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటం వల్లనే కాంగ్రెస్‌పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అందరు ఐకమత్యంగా పనిచేయాలని, అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై మాట్లాడవద్దని, నేరుగా తన దృష్టికి తీసుకరావాలన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయన్నారు. కొంతమంది నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డీనేటర్ పాశం రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, ప్యాక్స్ మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు ఆనందరెడ్డి, తీగల పుష్పలత, బెజ్జంకి శ్రీనివాస్, సత్యం, యాదవరెడ్డి, మల్లేశం, మాధవరెడ్డి, మామిడి రాజు, చిట్టి ప్రదీప్‌రెడ్డి,ముత్యం అమర్, విజయ్, ఉస్మాన్‌ల తో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్‌లు
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. వీరిలో తిప్పాపూర్ మాజీ సర్పంచ్‌లు దమ్మని లక్ష్మిలక్ష్మన్, బొల్లవేని మంజురమేష్, గాలిపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌లు అరుకుటి విజయలక్ష్మిమల్లేశం, న్యాత లక్ష్మిపోచయ్య, జవారిపేట గ్రామ మాజీ సర్పంచ్ పల్లె శ్రీలతరాజశేఖర్, మాజీ ఉపసర్పంచ్‌లు కొడిముంజ తిరుపతి, కాలువ దామోదర్, నాయకులు పల్లె ప్రణయ్‌కుమార్, బెజ్జంకి రమేష్, పౌలు, బెజ్జంకి తిరుపతి, సిరవేణి మహేష్, యాదమల్లయ్య, ఏగుర్ల నర్సయ్య, బాలయ్య, దమ్మని రాజు, అభినవ్, అబ్బసాని మల్లయ్య, సాంబ మంజుల, బొల్లవేని నర్సయ్య తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే వీరిందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Updated Date - Jul 17 , 2025 | 12:52 AM