ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:18 AM

ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వేములవాడ ఎమ్మె ల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వేములవాడ ఎమ్మె ల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అర్హులైన 65 మంది లబ్ధిదారులకు బుధవారం 28 లక్షల 48 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారిందని, వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల పైచిలుకు మంజూరు చేశామని వివరించారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, లబ్ధిదా రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:18 AM