ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యం

ABN, Publish Date - May 19 , 2025 | 12:40 AM

వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయా లకు వచ్చే భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యమ ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ కల్చరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయా లకు వచ్చే భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యమ ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండలంలోని అగ్రహారం హనుమాన్‌ ఆలయంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి రూ. 31 లక్షలతో ఆలయ ప్రాకార గోడ, ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయా నికి విచ్చేసిన ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు అంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ది, పట్ట ణాభివృద్ది, శ్రీజోడాంజనేయస్వామి అభివృద్ధి చేసుకుం టూ ముందుకు పోతున్నామని అన్నారు. అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన గ్రానైట్‌ వేయాలని నిర్ణయించడం జరిగిందని, రానున్న రోజుల్లో దశలవారీగా ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి వెళ్లినప్పుడు మూడు అంతస్తుల గోపురం కావాలని వారు కోరారని తెలిపారు. త్వరలోనే స్వామివారి సన్నిధిలో మూడంతస్తుల గోపురం నిర్మిస్తామని హామీచ్చారు. మామిడిపల్లి సీతారామచంద్ర ఆలయ ఆవ రణలో కల్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయంలో మెరుగైన వసతలు కల్పించడం లక్ష్యం గా అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.150 కోట్ల పైచిలుకు నిధులతో రాజన్న ఆలయ, పట్టణాభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే రూ.47కోట్లు కలెక్టర్‌ ఖాతాలో జమ అయ్యి ఉన్నాయని తెలి పారు. అంతే కాకుండా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రూ.76 కోట్లతో అన్నదాన సత్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. రాజన్న భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం అభి వృద్ధి చేస్తున్నామని, అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముం దుకు పోతున్నామన్నారు. శృంగేరి పీఠం వారు, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల వారు, ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్‌ నియోజకరవ్గ ఇంచార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, అనువంశీక ఆలయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య ఉన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:40 AM