ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

ABN, Publish Date - Jun 12 , 2025 | 02:31 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్యనందించడమే ప్రధాన లక్ష్యమని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నమోదులు పెంచడం, ప్రీస్కూల్‌ హాజరును పెంచడమే అమ్మ మాట... అంగన్‌ వాడీ బాట ముఖ్య ఉద్దేశమని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం అన్నారు.

సిరిసిల్ల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్యనందించడమే ప్రధాన లక్ష్యమని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నమోదులు పెంచడం, ప్రీస్కూల్‌ హాజరును పెంచడమే అమ్మ మాట... అంగన్‌ వాడీ బాట ముఖ్య ఉద్దేశమని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం అన్నారు. బుధవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అమ్మ మాట - అంగన్‌వాడీ బాట కార్యక్రమన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వేములవాడ రూరల్‌ మండలం ఎదురుగట్లలో జరిగిన అంగ న్‌వాడీ బాటలో లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రైవేట్‌ బడు లకు దీటుగా పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రత్యేకమైన సిలబస్‌ను రూపొందించి ఆటపాటలతో కూడుకున్న విద్యను పిల్లలకు అందజేసి పిల్లల్లో సృజనాత్మకను ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలతో పాటు మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ కూడా అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 02:31 AM