సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:58 AM
దేశవ్యాప్తంగా ఈనెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని విజ యవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వి రమ కోరారు.
సిరిసిల్ల రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా ఈనెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని విజ యవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వి రమ కోరారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మి క భవనంలో గురువారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమం టి ఎల్లారెడ్డి అఽధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రంలో అధికా రంలోఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విఽధానాలపై ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధిం చిన కరపత్రాలు, బుక్‌లెట్‌లను నాయకులతో కలిసి రాష్ట్ర కార్యద ర్శి రమ ఆవిష్కరించారు. ఈసందర్భంగా రమ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గ హక్కులను కాలరాస్తూ కార్మికు లను కట్టుబానిసలు చేసే విధానాలను అవలంభిస్తుందని మండి పడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ నాలుగు లేబర్‌కోడ్‌లు గనుక అమలు అయితే కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా పనిగంటల పెంపు కార్మికులకు భధ్రత లేకుండా పోతుంద న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9న చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఆఫీస్ బేరర్స్ గుర్రం అశోక్, అన్నల్‌దాస్ గణేస్, సూరం పద్మ, శ్రీరాము ల రమేష్‌చంద్ర, గీస బిక్షపతి, నక్క దేవదాస్, దాసరి రూప, సావనప ల్లి రాములు, కోలా శ్రీనివాస్, జిందం కమలాకర్, ఒగ్గు గణేష్, భారతి, చంద్రకళ, లత, ప్రభాకర్, నర్సయ్య, పోచమల్లు పాల్గొన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:58 AM