ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:12 AM

దేశవ్యాప్తంగా మే 20న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ముకుందలాల్‌ మిశ్రాభవన్‌లో జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజ్‌

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా మే 20న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ముకుందలాల్‌ మిశ్రాభవన్‌లో జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులపై కక్షపూరితంగా నాలుగు లేబర్‌కోడ్‌లు తీసుకు వచ్చిందన్నారు. లేబర్‌కోడ్‌లతో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు నిధులు పూర్తిగా లేకుండా పోతాయన్నారు. కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్స్‌ తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కార్మికులకు వివరించి సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కదిరే రమేష్‌, ఉపాధ్యక్షుడు జంబుకం వెంకన్న, పళ్ల తిరుపతి, కన్నం నరసయ్య, రాజాకుమారి, స్వామి, లింగారెడ్డి, నాంపల్లి శ్రీనివాస్‌, ఆశీర్వాదం సుధాకర్‌, కొమురయ్య, సంపత్‌, రాజయ్య, సదానందం, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:12 AM