మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశ ప్రగతి
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:07 AM
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు.
వేములవాడ టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు. వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మహిళ సమాఖ్య సంఘాల కు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, ఇటీవల మరణించిన మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళను కోటీశ్వ రులను చేయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారన్నారు. ఇందిరమ్మ రా జ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్‌రెడ్డి ప్రజాప్రభుత్వంలో మహిళ తల్లులకు పెద్దపీట వేశారన్నారు. గతంలో వైఎస్ పావలా వడ్డీకి రుణాలు మం జూరు చేశారని, ఐకేపీ రుణాలను మంజూరుచేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారం భం చేసి మహిళలకు ఆర్థిస్వాలంభన దిశగా ప్రోత్సహం అందించాలని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు రూ.20వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు. గత ప్రభుత్వ మహిళ సంఘాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలారు విద్యుత్‌ప్లాంటులు, ఆర్టీసీ సంస్థకు అద్దె బ స్సులు, పెట్రోల్ బంక్‌లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా అం దించే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళ పేరుమీద మంజూరు చేస్తున్నామన్నారు. 93లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఇందిరా మహిళ శక్తిలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగా లని మైక్రోఎంటప్రైజేషన్, మహిళ శక్తి స్టిచింగ్ సెంటర్స్, ఇవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, సోలర్ పవర్‌ప్లాంట్‌లు, డైరీ యూనిట్స్ వంటి వాటిని ఏర్పాటు చేయ డం, వడ్డీ లేని రుణాలను మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో అన్ని రం గాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళుదామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వాదాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ శేషాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, చెలుకల తిరుపతి, కచ్చ కాయల ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 01:07 AM