అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:46 AM
అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలుచేయడంలో పూర్తిగా వైఫల్యమైందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలుచేయడంలో పూర్తిగా వైఫల్యమైందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో గురువారం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అధ్యక్షతన మండలస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదవుల కోసం పుట్టిన పార్టీ కాదని, ప్రత్యేక ప్రాంతం ఏర్పాటు చేయడానికి పుట్టిన పార్టీ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకే దక్కుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు పెడుతూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అనేక అవమానాలు పడుతున్నా సమయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొనవారికి ఇలాంటివి ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు దక్కించుకొని సత్తా చూపాలన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని వారికి అండగా ఉంటానన్నారు. పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, సెస్‌డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ప్యాక్స్‌చైర్మన్ తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసగుప్తా, రాజిరెడ్డి, గొడుగు తిరుపతి, ఉడుతల వెంకన్న,కేవీఎన్‌రెడ్డి, జీతేందర్‌గౌడ్, ఒగ్గు నర్సయ్యయాదవ్, తూటి పర్శరాం, తడ్కపెల్లి భూమయ్య, ఎండ్ర చందన్, రఘు, అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:46 AM