ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలది కపట ప్రేమ..

ABN, Publish Date - Jul 13 , 2025 | 12:43 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీలపై బడుగుబలహీన వర్గాలపైన కపట ప్రేమను చూపుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీలపై బడుగుబలహీన వర్గాలపైన కపట ప్రేమను చూపుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయలో విలేకరులల సమావేశంలో కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడారు. సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కులగణను చేపట్టారన్నారు. చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో ఆమోదం కోసం పంపించారన్నారు. దేశంలో బీసీలకు బీజేపీ ద్వారానే న్యాయం జరుగతుందని ప్రధాన మంత్రి మోదీ చెప్పారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు పంపించిన కులగణనపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చి క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసి స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్స్‌ ఇవ్వడానికి అడుగులు వేస్తుందన్నారు. ఆర్డి నెన్స్‌ రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల తిరుపతిరెడ్డి, డైరెక్టర్‌ వెంకటేశం, కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:43 AM