ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ భారతి చట్టం దేశానికి దిక్చూచి

ABN, Publish Date - Apr 23 , 2025 | 01:06 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం దేశానికి దేశానికి దిక్సూచిలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం షానగర్‌లో భూ భారతి ఆర్వోఆర్‌ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు.

రామడుగులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం

రామడుగు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం దేశానికి దేశానికి దిక్సూచిలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం షానగర్‌లో భూ భారతి ఆర్వోఆర్‌ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఏ తప్పు చేయకుండానే రైతులను, అదికారులను ధరణి దోషులుగా నిలబెట్ట్టిందన్నారు. రైతుల కోసం ఎంతో మంది మేధావులు నాయకులు, రైతు సంఘాల నాయకులు అధికారులతో చర్చించి మెరుగైన ఆర్వోఆర్‌ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్బగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధీర్ఘకాలికి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి దోహద పడుతుందన్నారు. రైతులకు తమ భూముల విషయంలో అభద్రతా భావానికి తావులేకుండా జవాబుదారీ తనాన్ని పెంచెందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశ పెటిందనిరు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఫ భవిత సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌ :

మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్‌ ఫమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్బంగా దివ్యాంగ విద్యార్థులతో మాట్లాడారు. టీచింగ్‌ మెటీరియల్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం దేశరాజ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Apr 23 , 2025 | 01:06 AM