అధికారులే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు
ABN, Publish Date - May 07 , 2025 | 11:55 PM
ప్రజల వద్దకు అధికారులూ వచ్చి సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్‌ను ప్రారంభించినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, మే 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజల వద్దకు అధికారులూ వచ్చి సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్‌ను ప్రారంభించినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని రహీంఖాన్‌పేట, వెల్జీపూర్, ఒగులాపూర్ గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ప్రజల ద్వారా వచ్చిన విన్నపాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. రహీంఖాన్‌పేట గ్రామానికి ఫీడర్ చానల్ నిర్మాణం, సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరుచే యాలని గ్రామస్థులు కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట్లోకి తేవడం జరుగుతుందన్నారు. పనుల కోసం కార్యాలయాల చుట్టు తిరగవద్దని వారంలో మూడు రోజుల పాటు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ సమస్యలు అప్‌లోడ్ చేసినట్లయితే వాటిని పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలుచేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ల క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫారూ ఖ్, ఎంపీడీఓ శశికళ, వైద్యాధికారిణి జీవనజ్యోతి, సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఎం వాణిశ్రీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, పసుల వెంకటి, ముక్కీస కేశవరెడ్డి, గుండ వెంకటేశం, రాంప్రసాద్‌రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, స్వామిరెడ్డి, వీరేశం, బాలయ్య, ప్రసాద్, సురేందర్‌రెడ్డి, శంకర్, నితీష్, ప్రవీణ్, శ్రీనివాస్, మంద బాల్‌రెడ్డి, పర్శరాం, అనీల్, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
మండలంలోని వెల్జీపూర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర భవనానికి భూమిపూజ, చౌడాలమ్మ ఆలయంలో బోర్‌వెల్‌ను ప్రారంభించారు. ఒబులాపూర్ గ్రామంలో రెడ్డి సంఘ ప్రహారిగోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈసందర్భంగా నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
Updated Date - May 07 , 2025 | 11:55 PM