గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:40 AM
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇందిరా మహిళశక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే ఇందిరా మహిళ శక్తి కార్యక్రమాలను చేపట్టామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డీఈ మిలింద్, ఏపీఎం ఓదెల గంగాధర్, మాజీ సర్పంచ్ సుధాకర్, చిర్ర నరేష్, రౌతు గంగాధర్, సీడీపీవో మమత, గుంటి రవి, కడ మహేష్, రవి, గ్రామ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు..
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అర్హులైన ప్రతీ ఒక్కరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రేచపల్లి, అర్పపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే పేద ప్రజల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వహిద్దీన్, ఎంపీడీవో గంగాధర్, డీఈ మిలింద్, ఏఈ రాజమల్లయ్య, ఎంపీవో సలీం, నాయకులు రాజేందర్‌రడ్డి, మనోహర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ది పనులకు భూమిపూజ
జగిత్యాల అర్బన్: జగిత్యాల పట్టణంలోని 11వ వార్డులో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని డబుల్ బెడ్ రూం ఇళ్ల మౌలిక వసతుల కల్పనకు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు బాలె లత, పడిగెల చంద్రయ్య, నక్క గంగాధర్, పరంకుశం క్రాంతి, రూట్ల రాజేశ్, సుజయ్ బొల్లరపు మహేష్, బాలె శంకర్, గజ్జెల శంకర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:40 AM