ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీజీ ఐపాస్‌ అనుమతులు జారీ చేయాలి

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:57 AM

జిల్లా లో త్వరగా పరిశ్రమలు స్థాపించి యువత కు ఉపాధి కల్పించేందుకు టీజీ ఐపాస్‌ కిం ద వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయం లో జారీచేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

సిరిసిల్ల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో త్వరగా పరిశ్రమలు స్థాపించి యువత కు ఉపాధి కల్పించేందుకు టీజీ ఐపాస్‌ కిం ద వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయం లో జారీచేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, పరిశ్ర మల స్థాపన టీఎస్‌ఐపాస్‌, టీఫ్రైడ్‌ సంబం ధిత అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లా లో టీజీఐపాస్‌ అమలవుతున్న విధానం తీరుతెన్నులను తెలుసుకున్నారు. జిల్లాలో పరిశ్ర మల అనుమతుల దరఖాస్తులను సకాలంలో జారీ చేయాలన్నారు. జిల్లాలో నూతన పరిశ్రమ ల స్థాపనకు సంబంధించిన 27 ప్రతిపాదనల్లో 21 ప్రతిపాదనలకు వివిధ శాఖలు జారీ చేసిన అనుమతులను సమీక్షించి మిగిలిన అరు ప్రతి పాదనలను తక్షణమే సమీక్షించి అనుమతులు జారీ చేయాలని కలెక్టర్‌ అన్నారు. జారీ చేసిన అనుమతులు అన్‌లైన్‌లో ఉండాలన్నారు. జిల్లా లో టీఫ్రైడ్‌ పథకం కింద మంజూరు చేసిన 42 యూనిట్ల ఫైల్స్‌ సంపూర్ణ వివరాలు అందించాల న్నారు. టీ ఫ్రైడ్‌ కింద అందించిన ట్రాక్టర్లను గతంలో అక్రమ ఇసుక రవాణాకు వాడుతున్నా రని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం హన్మంత రావు, టీజీ ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మహేశ్వర్‌, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న, ఇతర శాఖల అధికారు లు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:57 AM