హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:37 PM
హిందువులను లక్ష్యంగా చేసుకొని పహల్గాంలో ఉగ్రదాడులు చేశారని వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అధిముళ్ల విద్య సాగర్, భజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. కాశ్మీర్‌లోని పహ ల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
గణేశ్‌నగర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): హిందువులను లక్ష్యంగా చేసుకొని పహల్గాంలో ఉగ్రదాడులు చేశారని వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అధిముళ్ల విద్య సాగర్, భజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. కాశ్మీర్‌లోని పహ ల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులను మతం అడిగి చంపడం దారుణమన్నారు. అనంతరం ఉగ్రవాదుల ఫ్లెక్సీని దహనం చేశారు. పరిషత్ ఉపాధ్యక్షులు రుధ్రోజు సరుపా రని, భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, జిల్లా సహా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
భగత్‌నగర్ : కొత్తపల్లి మండలం మల్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నివాళులు అర్పించారు. రైతు సేవా సమితి అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, పండుగ సాయికృష్ణ, లక్ష్మీరాజం పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ : మాల జేఏసీ ఆధ్వర్యంలో నివాళుల ర్పించారు. జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, మేడి అంజయ్య, కాడ శంకర్ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్ : యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొయ్యడ వేణు ఆధ్వర్యంలో నగరంలోని మారుతీ నగర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు దొంతి గోపి, కరీంనగర్ యూత్ కాం గ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు కృపాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
గణేశ్‌నగర్: తెలంగాణ రజక సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు పూసాల సంపత్ రజక ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ చౌక్ నుంచి తెలంగాణ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు.
కరీంనగర్ రూరల్,తీగలగుట్టపల్లిలో కోదండ రామాలయ కమిటీ, ఉపాధ్యాయ సేవా సమితి, నిఫా, హిందూ సంఘాలు, మాజీకార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
Updated Date - Apr 25 , 2025 | 11:37 PM