ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెడికల్‌ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం..

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:46 AM

తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారిందని ప్రభు త్వ విప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ రూరల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారిందని ప్రభు త్వ విప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వేములవాడ పట్టణ, అర్బన్‌ పరిధిలో అర్హులైన 76 మందికి కల్యాణక్ష్మి, షాదీముబారక్‌, 18లక్షల 80వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వైద్యారోగ్య రం గంలో తెలంగాణ సాధిస్తు న్న ప్రగతి, ఇతర రాష్ట్రాల కు స్ఫూర్తిదాయకంగా మారిందన్నారు. ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్ట గానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజారోగ్యం పై ప్రజా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నార న్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎల్‌వోసీల ద్వారా దాదాపు 20కోట్ల రూపాయలు అందించడం జరిగింద న్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా అమలు చేస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు. రాజన్న ఆల యాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తు న్నానన్నారు. ఎమ్మార్వో శ్రీనివాస్‌ రావు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ మండల అధ్యక్షుడు పల్లి కనుకయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:46 AM