ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN, Publish Date - May 30 , 2025 | 12:38 AM

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతు లు, బదిలీలు చేపట్టాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దుమాల రాంనాథ్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు.

సిరిసిల్ల రూరల్‌, మే 29 (అంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతు లు, బదిలీలు చేపట్టాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దుమాల రాంనాథ్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల లో గురువారం టీపీటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను జిల్లా అధ్యక్షు డు రాంనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిం చాలని పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బిల్లులను మంజూరు చేసి విద్యారంగ అభివృద్ధికి పాటుపాడాలని కోరారు. ఉపాధ్యాయుల బాధ్యతల కోసం నిలబడుతూనే హక్కుల కోసం పోరాడే సంఘంగా టీపీటీఎఫ్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. న్యాయ పోరా టాల ద్వారా సమ్మె హక్కుని సాధించిన సంఘం టీపీటీఎఫ్‌ అని, అన్ని ఫెడరేషన్‌ ఉపాధ్యాయ సంఘాలకు మాతృక అని అన్నారు. 1947లో ఏర్పడిన ఏపీటీఎఫ్‌, తెలం గాణ ప్రాంతానికి 1983లో వ్యాపించిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీపీ టీఎఫ్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌ సత్తు రవీందర్‌, జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్‌రెడ్డి, నూగురి దేవేందర్‌, రజనీరాణి, జిల్లా కార్యద ర్శులు తాళ్లపల్లి శ్రీధర్‌, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కదిరె శ్రీనివాస్‌, వేములవాడ మండల అధ్యక్షుడు బోజ్జ కృష్ణ, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు బండి ఉపేందర్‌, కోనరావుపేట మండల అధ్యక్షుడు కుమార్‌, ఇల్లంతకుంట మండల ప్రధాన కార్యదర్శి లౌడ్య శ్రీనివాస్‌, పోన్నం శ్రీనివాస్‌, వేణుగోపాల్‌రావు, మఽధుసూదన్‌, సుల్తాన్‌ శ్రీనివాస్‌, సతీష్‌, రాంప్రసాద్‌, భూమేష్‌, రమేష్‌, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:38 AM