ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు మూలం

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:10 AM

సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు మూలమని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు. శనివారం కొత్తపల్లిలోని అల్పోర్స్‌ ఈ-టెక్నో పాఠశాలలో ఉపాధ్యాయుల మూడో దశ వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు విశ్లేషనాత్మకంగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

భగత్‌నగర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు మూలమని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు. శనివారం కొత్తపల్లిలోని అల్పోర్స్‌ ఈ-టెక్నో పాఠశాలలో ఉపాధ్యాయుల మూడో దశ వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు విశ్లేషనాత్మకంగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉపాధ్యాయులను, అన్ని వసతులు కల్పించిన అల్పోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ నరేందర్‌రెడ్డిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో కోర్స్‌ సమన్వయ కర్త అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌రెడ్డి, అంజరెడ్డి, భగవంతరావు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:10 AM