ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం

ABN, Publish Date - Jul 13 , 2025 | 12:41 AM

ప్రతిభావంతు లైన విద్యార్థుల ఉన్నత చదువుకోసం పద్మశాలి అఫిషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోషియేషన్‌ (పోపా) చేయూత నిస్తుందని టెక్స్‌ టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గుడూరి ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

సిరిసిల్ల రూరల్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభావంతు లైన విద్యార్థుల ఉన్నత చదువుకోసం పద్మశాలి అఫిషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోషియేషన్‌ (పోపా) చేయూత నిస్తుందని టెక్స్‌ టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గుడూరి ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సిరిసిల్ల పద్మ శాలి కల్యాణ మండపంలో పద్మశాలి అఫిషియల్స్‌, ప్రోఫెషనల్స్‌ అసోషియేషన్‌ అధ్వర్యంలో శనివారం ప్రతిభావంతులైన విద్యా ర్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. అలాగే ఇంటర్మీడియేట్‌, ఎంసెట్‌, ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. అలాగే పోపా సేవ ల్లో ప్రత్యక్ష భాగస్వాములను, ఆర్థిక విరాళాలు అందించిన దాతలను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గంలో ప్రతిభకు కొదవ లేదని పేదరికం పెద్ద చదువులకు అటంకం కాకూడదని ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ప్రతి వేసవిలో విద్యార్థుల శ్రేయస్సు కోసం పాలిసెట్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఉచిత శిక్షణలతో పాటు కార్మిక ప్రాంతాల్లో అరోగ్య, వైద్య శిభిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అవార్డు లు అందుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని రాజీలేని కృషితో జీవితంలో రాణించాలని అక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోపా ప్రతినిధులు దేవత ప్రభాకర్‌, చేరాల ప్రభాకర్‌ , బైరి ప్రభాకర్‌, అడెపు వేణు, మోర దామోదర్‌, అంకారపు జ్ఞానోభా, వాసాల హరిప్రసాద్‌, గడ్డం సత్యనారాయణ, శ్రీపతి భూమేష్‌, గుండెల్లి రవి, ద్యావనపల్లి పరమేశ్వర్‌, బండారి శ్రీనివాస్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:41 AM