శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 30 , 2025 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యా యుల కోసం చేపట్టిన శిక్షణ తరగతులను అన్నీ వర్గాల ఉపాద్యాయులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్య పరిశీలన మండలి డైరెక్టర్ గాజర్ల రమేష్ కోరారు.
సిరిసిల్ల రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యా యుల కోసం చేపట్టిన శిక్షణ తరగతులను అన్నీ వర్గాల ఉపాద్యాయులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్య పరిశీలన మండలి డైరెక్టర్ గాజర్ల రమేష్ కోరారు. సిరిసిల్ల పట్ట ణంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవ శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులతో పాటు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ ఉపాధ్యా యుల శిక్షణ తరగతుల కేంద్రాలను గురువారం డైరెక్టర్ గాజర్ల రమేష్ సందర్శించి శిక్షణ తరగతుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలో ఉపాధ్యాయులకు చేపట్టిన శిక్షణ తరగతులను సద్వి నియోగం చేసుకొని పాఠశాలల్లో పిల్లల అభివృద్ధికి పాటు పడాలన్నారు. శిక్షణ కా ర్యక్రమాల్లో ఉత్తమంగా నిలిచిన పావని, రవీందర్, శ్రీలత, మనోహర్, వేణుగోపాల్‌రావు, శ్రీరాం మనోహర్, పరకాల రవీందర్, అబ్ధుల్ రవూఫ్‌లను సన్మానించారు. జిల్లా సైన్స్‌అధికారి పాముల దేవయ్య, కోర్సు కోఆర్డినేటర్ శైలజ, ప్రధానోపాధ్యాయులు చకినాల శ్రీనివాస్, రీసోర్స్ పర్సన్లు తిరుపతిరెడ్డి, భాస్కర్, సంతోష్, యాద రవి పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 12:40 AM