ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగిన ‘స్వనిధి’..

ABN, Publish Date - May 23 , 2025 | 01:17 AM

కరోనా మహమ్మారితో చితికిపోయిన వీధివ్యాపారులకు చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(ఆత్మ నిర్భర్‌ నిధి) రుణాల ప్రక్రియ చేపట్టింది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మహమ్మారితో చితికిపోయిన వీధివ్యాపారులకు చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(ఆత్మ నిర్భర్‌ నిధి) రుణాల ప్రక్రియ చేపట్టింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు అందించి చిరు వ్యాపారాన్ని కొనసాగించుకునే దిశగా మూడు విడతలుగా అందించే స్వనిధి రుణానికి బ్రేక్‌లు పడ్డాయి. ఆరు నెలలుగా కొత్త రుణాలు ఇవ్వకపోగా, నాలుగు నెలలుగా సంబంధిత పోర్టల్‌ కూడా నిలిచిపోయింది. స్వనిధి స్థానంలో కొత్త పథకం కసరత్తు చేస్తున్న క్రమంలోనే రుణాల ప్రక్రియ నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరు వ్యాపారులు మాత్రం రుణాలు అందక నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో మెప్మా ద్వారా చిన్న తరహాలో రుణాలు అందుకోవడం ద్వారా వీధి వ్యాపారులకు కొంత ఊరటను ఇచ్చే పథకం మూలన పడడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధికి ఉపయోగకరంగా ఉన్న స్వనిధి పథకం స్థానంలో కొత్త పథకం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.

మూడు విడతలుగా రుణాలు..

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో కరోనా లాక్‌డౌన్‌ నుంచి స్వనిధి పథకాన్ని తీసుకవచ్చింది. వీధి వ్యాపారులకు మొదటి విడతగా రూ.10 వేలు, అది చెల్లించిన తరువాత రెండో విడతగా రూ.20 వేలు, మూడో విడతగా రూ.50 వేల రుణాలు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామంది వీధి వ్యాపారులు మొదటి విడతలో ఎంతో ఉత్సాహంగా తీసుకున్న రూ.10 వేల రుణాన్ని చెల్లించి రూ.20 వేల రుణాన్ని తీసుకున్నారు. మూడో విడతలో మాత్రం ముందుకు రాలేదు. సక్రమంగా చెల్లిస్తున్న వీధి వ్యాపారులు మాత్రం ఆరు నెలలుగా రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన లబ్ధిదారులు మూడో విడతగా రూ.50 వేలు ఇవ్వాలని కోరుతున్నారు.

మరో పథకానికి కసరత్తు..

ప్రధానమంత్రి స్వనిధి పథకంలో మార్పులు తీసుకవచ్చి వీధి వ్యాపారులకు మరింత మెరుగ్గా రుణాలు అందించే విధంగా కొత్త పథకం తీసుకవచ్చే దిశగానే స్వనిధి పథకాన్ని నిలిపివేసినట్లుగా భావిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ నిధి కింద కొత్త పథకానికి సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. రూ.50 నుంచి లక్ష వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

జిల్లాలో స్వనిధి ద్వారా రూ26.40 కోట్లరుణాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికి 8,418 మంది లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వనిధి ద్వారా జిల్లాలో 26.40 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. దరఖాస్తులు 8,507 మంది మొదటి విడతలోనే చేసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో మొదటి విడతలో రూ 10 వేల చొప్పున 7,933 మంది రూ 7.93 కోట్లు అందించారు. వీరు ఏడాదిలోగా రూ 10 వేలు చెల్లించి తిరిగి రెండవ విడతలో 6180 మంది రూ 20వేల చొప్పున రూ 12.36 కోట్లు రుణం పొందారు. మూడవ విడతలో మాత్రం 1222 మంది రూ 50 వేల చొప్పున రూ 6.11 కోట్ల రుణాలు పొందారు. స్వనిధి పక్రియ సక్రమంగానే కొనసాగుతున్న ఆరు నెలలుగా రుణాలు నిలిచిపోవడంతో పథకం పునరుద్ధరించాలని కోరుతున్నారు.

జిల్లాలోని మున్సిపాలిటీల్లో మూడు విడతల్లో లబ్ధిదారులు ఇలా..

మున్సిపాలిటీ మొదటి విడత రెండో విడత మూడో విడత (రూ10 వేలు) (రూ 20 వేలు) (రూ 50 వేలు)

సిరిసిల్ల 5811 4546 1025

వేములవాడ 2122 1634 197

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 7933 6180 1222

----------------------------------------------------------------------------------------------------

Updated Date - May 23 , 2025 | 01:17 AM