మొదలైన రేషన్ కార్డుల సర్వే
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:51 AM
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్షేత్రస్థాయిలో సర్వే మొదలు పెట్టారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్షేత్రస్థాయిలో సర్వే మొదలు పెట్టారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు గ్రామ, పట్టణ సభలు, మీసేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రారంభమయ్యింది. ఇందు కోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. ఆ యాప్‌లో రేషన్ కార్డుదారుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న నంబర్, ఇంటి నంబర్, రేషన్ డీలర్ నంబర్, దరఖాస్తుదారుడి పేరుతోపాటు ఆ కుటుంబంలో గల కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, ఆధార్ నంబర్లు, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు, తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుడు అర్హుడా, కాదా అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. రెండు రోజుల నుంచి గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుల పరిశీలన చేస్తూ అర్హులను గుర్తిస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 2,07,280 ఆహార భద్రత కార్డులు ఉండగా వీటిలో 5,97,071 మంది లబ్ధిదారులు ఉన్నా రు. 12,269 అంత్యోదయ కార్డులు ఉండగా వీటిలో 33,776 మంది లబ్ధిదారులు, 155 అన్నపూర్ణ కార్డుల్లో 163 మంది ఉన్నారు. మొత్తం 2,19,712 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ నెలా 4,013 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల నుంచి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ కార్డులకు డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డులు ఉన్న వారిలో సగానికి పైగా లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని కిలోకు 10 నుంచి 12 రూపాయలకు అమ్ముకోగా, సన్న బియ్యం మాత్రం తీసుక వెళుతున్నారు. దీంతో తమకు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అని అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు.
36,514 దరఖాస్తుల రాక..
కొత్త రేషన్ కార్డుల కోసం పట్టణ, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 36,514 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామసభల ద్వారా వచ్చిన 32,174 దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో కార్యాలయాల్లో ఉండే ప్రజాపాలన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందిం చింది. ఆ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో గ్రామ పంచా యతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. అలాగే మీ సేవా ద్వారా 4,340 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌కు వెళుతున్నాయి. అక్కడ తహసీల్దార్ అర్హులను గుర్తిం చేందుకు గిర్దావర్లకు బాధ్యతను అప్పగించగా, వారు విచారణ జరిపి అర్హులా కాదా అని తేల్చి తహసీ ల్దార్లకు రిపోర్టు చేస్తున్నారు. అర్హులైన వారి దరఖా స్తులను తహసీల్దార్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి లాగిన్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి డీఎస్‌ఓ అర్హులైన వారి దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారి లాగిన్‌కు పంపుతున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వివరాలను క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నారు.
చివరగా 360 డిగ్రీస్ యాప్ ద్వారా పరిశీలన
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్షేత్ర స్థాయిలో అర్హులను గుర్తించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో చివరగా మరోసారి 360 యాప్ ద్వారా పరిశీలిస్తున్నారు. అక్కడ అర్హులని తేలిన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నవం బర్‌లో నిర్వహించిన కులగణన సర్వే సందర్భంగా మొత్తానికే రేషన్ కార్డులు లేని కుటుంబాలు 15,255 ఉన్నట్లు గుర్తించారు. వీరు అర్హులా, కాదా అని జనవరిలో నిర్వహించిన గ్రామసభలకు ముందు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి 12,572 కుటుంబాలు అర్హులని గుర్తించారు. జనవరి 26న ఐదారు కుటుంబాలకు కొత్త కార్డుల పత్రాలను అంద జేశారు. కానీ మిగతా వారికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కార్డులు ముద్రించిన తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెబుతున్నప్ప టికీ కొత్త కార్డులను మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ సం క్షేమ ఫలాలు తమకు ఎప్పుడు అందుతాయని అంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి కొత్త రేషన్ కార్డులను త్వరగా పంపిణీ చేయాలని కోరుతున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:51 AM