నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:22 AM
పాఠశాలలకు వేసవి సెలవులు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు వేసవి సెలవులు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. గురువారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ఎప్పటిలాగే వేసవి సెలవులను ప్రకటించారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో సెలవుల్లో పాఠశాలల్లో తరగతులను నిర్వహించవద్దని, ఎవరైనా పాఠశాలలు ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇన్నాళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇకపై ఆట పాటలతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఇళ్లలోనే ఉంటూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:22 AM