ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌తో మిత్ర బంధం కొనసాగిస్తూనే పోరాటాలు

ABN, Publish Date - Jun 18 , 2025 | 01:04 AM

తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో మిత్ర సంబం ధాలు కొనసాగిస్తూనే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని నూతనంగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో మిత్ర సంబం ధాలు కొనసాగిస్తూనే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని నూతనంగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు. మంగళ వారం సిరిసిల్ల పట్టణం సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన మంద సుదర్శన్‌ను సీపీఐ జిల్లా, పట్టణ నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంద సుదర్శన్‌ మాట్లాడారు. జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన బద్దం ఎల్లారెడ్డి, అనబేరి ప్రభాకర్‌రావు, గుమ్మి పుల్లయ్య స్పూర్తితో జిల్లా కౌన్సిల్‌ కార్యవర్గం సభ్యుల సహకారంతో సీపీఐకి జిల్లాలో పునర్‌ వైభవం తీసుకొస్తామన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పార్టీ బలంగా ఉన్నచోట సీపీఐ పోటీ చేస్తుందన్నారు. జిల్లాలో అన్ని ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ కార్మికవర్గ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. జిల్లాలో వ్యవసా యానికి యోగ్యమైన లక్ష ఎకరాల పైచిలుకు పోడు భములు ఉన్నాయని వాటిని అర్హులైన రైతు కూలీలకు పంచాలని భవిష్యత్తులో పారాటాలు చేస్తామన్నారు. జిల్లాలోని అర్హులైన నిరుపేదలందరికి కూడా ప్రభు త్వం నివేశ స్థలాలు ఇచ్చి నిర్మాణం కోసం రూ.8లక్షలు ఇవ్వాలని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మానేరు నదిపై దాదాపు రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి తొమ్మిది చెక్‌ డ్యాములు నిర్మించగా అందులో ఏడు చెక్‌ డ్యాములు వరదలతో కూలిపోయాయని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని తిరిగి నిర్మించి గతంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెక్‌ డ్యాములను నిర్మించిన కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 40 సంవత్స రాల క్రితం సీపీఐ ఆధ్వర్యంలో సుధీర్గమైన పోరాటాలు చేసి బద్దం ఎల్లారెడ్డినగర్‌లో సుమారు 2000 మందికి నివేశ స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు. నాటి నివే శన స్థలాలకు గత ప్రభుత్వం రిజిష్ట్రేష న్‌ హక్కులను కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపటినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిం చారు. రిజిష్ట్రేన్‌ హక్కులు లేక పోవ డంతో లబ్ధిదారులు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని కాం గ్రెస్‌ ప్రభుత్వం లబ్ధిదారులకు రిజిష్ట్రే షన్‌ హక్కులు కల్పించేందుకు చట్టప రమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్ర భుత్వం ఆదివాసీ హక్కులను పూర్తిగా కాలరాస్తోందని అందులో భాగంగా ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీ లను అడవుల నుంచి తరిమివేసే ప్రయత్నంలో భాగం గా ప్రశ్నించే వారిని ఎన్‌కౌంటర్ల పేరుతో చంపుతుంద ని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఆపరేషన్‌ కగార్‌ను విరమించుకోవాలని మావో యిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ మాజీ జిల్లా కార్య ద ర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, నాయ కులు కడారి రాములు, అజ్జ వేణు, మీసం లక్ష్మన్‌, కేవీ అనసూర్య, మంద అనిల్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:04 AM