ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజన్న కోడెల సంరక్షణకు పటిష్ట చర్యలు

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:00 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కోడెల కోడెల సంరక్షణ కు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్పష్టం చేశారు.

వేములవాడ కల్చరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కోడెల కోడెల సంరక్షణ కు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్పష్టం చేశారు. వేములవాడ పరిధిలోని తిప్పాపూర్‌లో ఉన్న వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని 32 జతల కోడె పిల్లలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలో మొత్తం పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు. వాటి నిర్వహణ తదితర అంశాల్లో ఏమైనా పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోశాల ఆవరణలో లోతుగా ఉన్న స్థలంలో మట్టిని పోయిస్తూ చదును చేస్తున్నామని తెలిపారు. కోడెలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వాటిని అందిస్తున్నామని వివరించారు. పశువైద్యాధికారుల బృందంతో జీవాలకు వైద్యం అందిస్తూ పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. హాజరైన ఆర్డీఓ రాధాభాయి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, ఈఓ వినోద్‌ రెడ్డి, తహశీల్దార్‌ విజయ ప్రకాష్‌ రావు, మున్సిపల్‌ కమీషనర్‌ అన్వేష్‌, తదితరులు ఉన్నారు.

నాలుగు రాజన్న కోడలు మృతి..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి తిప్పాపూర్‌ గోశాలలో ఆదవారం ఉదయం నాలుగు కోడలు అనారోగ్యంతో మృతిచెందాయి. ఘోశాలలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న కోడెలు మృతిచెందాయి. మృతిచెందిన కోడెలను ట్రాక్టర్‌లో తరలించి మూలవాగులో ఖననం చేశారు.

Updated Date - Jun 02 , 2025 | 01:00 AM