జగిత్యాల సమగ్రాభివృద్ధికి కృషి
ABN, Publish Date - May 11 , 2025 | 12:13 AM
జగిత్యాల సమగ్రాభివృద్ధికి అవస రమైన కృషిని చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల సమగ్రాభివృద్ధికి అవస రమైన కృషిని చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం జగిత్యాల పట్టణంలోని 13, 14వ వార్డు ల్లో రూ. 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ జగిత్యా ల పట్టణంలో దాదాపు రూ. 1.55 కోట్లతో అభివృద్ధి పనులు జరుగు తున్నాయన్నారు. విద్యానగర్, పోచమ్మవాడ, బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ఆవరణలో నీటి ట్యాంక్ మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషన ర్ స్పందన, మాజీ కౌన్సిలర్ కూతురు పద్మ పాల్గొన్నారు.
పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాల రూరల్ (ఆంధ్రజ్యోతి) : నిరు పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 50 వేల చెక్కును, నాలుగు లక్షల యాభైవేల బాండ్‌ను మృతుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఏడీఈ జవ హర్‌నాయక్, నాయకులు రాంచంద్రం, వెంకట్‌రాజం, సాగర్‌రావు, సురేందర్, శ్రీనివాస్‌రెడ్డి, అంజన్న, అంజిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
- జగిత్యాల మండలం విధ్యాధికారిగా నియమితులైన చంద్రకళ, డీటీవో భద్రునాయక్ శనివారం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు.
- జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్‌లో గల సీతారామ చంద్రస్వామివారి కల్యాణ అక్షింతలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ఆదర్శ బడుగు, బలహీనవర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంగన్న, పూజారి కిరణ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
Updated Date - May 11 , 2025 | 12:14 AM